బాబాయ్ స్పీచ్‌కి అబ్బాయ్ ఫిదా

  • IndiaGlitz, [Tuesday,December 18 2018]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ అధినేత రాజ‌కీయ ప్ర‌చారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు. ఆదివారం డ‌ల్లాస్‌లో ప్ర‌వాసాంధ్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడారు. ధైర్యం ఉండ‌టం అంటే భ‌యం లేక‌పోవ‌డ‌మ‌నేది కాదు.. ప్ర‌తిరోజూ భ‌యాన్ని ఎదుర్కొంటూ ముందుకుపోవ‌డ‌మే అంటూ ఉద్వేగ పూరిత‌మైన ప్ర‌సంగం చేశారు.

బాబాయ్ ప‌వ‌న్ ప్ర‌సంగంపై అబ్బాయ్ రాంచ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను విన్న బెస్ట్ ఇన్‌స్పిరేష‌న‌ల్ స్పీచ్ ఇది. ఇదే పవ‌న్‌క‌ల్యాణ్‌.. ది మ్యాన్‌, ది లీడ‌ర్‌, ది విజ‌న‌రీ అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు రాంచ‌ర‌ణ్‌. ప‌వ‌న్ స్పీచ్‌కు రాంచ‌ర‌ణ్ ఇలా స్పంద‌న తెల‌ప‌డంపై మెగాభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

More News

'ముద్ర' వాయిదా ప‌డ‌నుందా?

నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ముద్ర‌'. వాస్త‌విక ఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది.

వైవిధ్య‌మైన పాత్ర‌లో పాయల్ 

తొలి చిత్రం 'ఆర్.ఎక్స్ 100'లో లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయిన పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిగా కూడా మంచి ప్ర‌శంస‌లే అందుకుంది. అయితే వెంట వెంట‌నే సినిమాలు ఒప్పుకోకుండా అచి తూచి సినిమాల‌ను ఎంచుకుంటుంది.

ప్ర‌భాస్ గెస్ట్ హౌస్ సీజ్‌

రాయ‌దుర్గం ప‌రిధిలోని శేరిలింగం ప‌ల్లిలో స‌ర్వే నెం 46లో 84 ఏక‌రాల ప్ర‌భుత్వ భూమిని కొంత మంది ప్రైవేటు వ్య‌క్తులు ఆక్ర‌మించుకున్నారు. దీనిపై త‌హ‌సీల్దారు చ‌ర్య‌లు చేప‌డితే

'బాఘి 3'లో సారా అలీఖాన్‌

సైఫ్ అలీఖాన్ త‌న‌య సారా అలీఖాన్.. కేదార్‌నాథ్ చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గానే ఆ సినిమా స్టార్ట్ అయ్యింది.

చెంప చెల్లుమ‌నిపించిన జ‌రీన్‌

బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్‌ఖాన్ ప‌లు వివాదాలతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మ‌రో వివాదంతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది.