ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 40 శాతం కేసులు..

  • IndiaGlitz, [Thursday,October 01 2020]

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సెప్టెంబర్ నెలలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు ఒక్క సెప్టెంబర్ నెలలోనే నమోదు కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 26 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేవలం సెప్టెంబర్ నెలలోనే కరోనా కారణంగా 33 వేల మంది మృతి చెందారు. ఇక రోజువారి కేసుల విషయానికి వస్తే 80వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 63,12,584కు చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 98,678 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం క్రమక్రమంగా పెరుగుతోంది.

గడిచిన 24 గంటల్లో 85,376 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 52,73,201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 9 లక్షల 40 వేల యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 14,23,052 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. ఇప్పటి వరకూ 7 కోట్ల 56 లక్షల టెస్టులను దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.53 శాతం ఉండగా.. మరణాల రేటు 1.56 శాతం ఉంది. కరోనా రికవరీ రేటు అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.

More News

జ‌యం' ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల  'బోగ‌న్‌' ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల 'బోగ‌న్' చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

యాక్షన్‌తో ప్రారంభం కానున్న ‘పుష్ప‌’

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

ఆసుపత్రిలో కేటీఆర్ తనయుడు.. అసలేం జరిగిందంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దొంగల హౌస్‌గా మారిన బిగ్‌బాస్ హౌస్.. అంతా రచ్చ రచ్చే..

ఇవాళంతా కిల్లర్ కాయిన్స్ టాస్క్‌తోనే షో మొత్తం నడిచింది. షో స్టార్టింగ్ స్టార్టింగే సొహైల్‌కి అమ్మ రాజశేఖర్‌కు మధ్య రచ్చ.

సినిమా థియేట‌ర్స్‌, స్కూల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

కేంద్ర ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్‌ను ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 30తో అన్‌లాక్ 4.0 ముగిసింది.