'అఖండ' నుంచి రామ్ లక్ష్మణ్ అవుట్.. మెగాస్టార్, సూపర్ స్టార్ కోసమే!

టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ అంటే మొదట వినిపించే పేరు రామ్ లక్ష్మణ్. వీరిద్దరి ఫైట్ కొరియోగ్రఫీ లేకుండా దాదాపుగా పెద్ద హీరోల సినిమాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ఏళ్ల తరబడి వీరిద్దరూ టాలీవుడ్ లో క్రేజీ ఫైట్ మాస్టర్స్ గా కొనసాగుతున్నారు.

కరోనా మహమ్మారి వల్ల వీరిద్దరి ప్లానింగ్ కూడా పూర్తిగా డిస్టర్బ్ అయింది. దీనితో పరిస్థితులు కు అనుగుణంగా మారక తప్పలేదని ఈ యాక్షన్ ద్వయం చెప్పారు. కరోనాకి ముందు వీరిద్దరూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, బోయపాటి అఖండ చిత్రాలని అంగీకరించారు.

కానీ కరోనా వల్ల ఈ చిత్రాల షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి ఆచార్య, మహేష్ సర్కార్ వారి పాట చిత్రాలకు ఎక్కువ డేట్లు కేటాయించాల్సి వచ్చింది. దీనితో ఆర్ ఆర్ ఆర్, అఖండపై ఫోకస్ చేయలేకపోయారు. అందువల్లే ఆ రెండు చిత్రాల నుంచి తప్పుకున్నట్లు రామ్ లక్ష్మణ్ తెలిపారు.

ఆర్ ఆర్ ఆర్, అఖండ లో భీకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ కి వీరిద్దరే కొరియోగ్రఫీ చేయాల్సిందట. అఖండ లో అయితే సెకండ్ హాఫ్ లో గూస్బంప్స్ తెప్పించెలా యాక్షన్ ఎపిసోడ్స్ ని రామ్ లక్ష్మణ్ ద్వారా రాబట్టుకోవాలని బోయపాటి ప్లాన్ తో ఉన్నారు. కరోనా వచ్చి ఆ ప్లాన్స్ మొత్తం నాశనం చేసింది.

మెగాస్టార్ చిరు నటించిన ఆచార్య చిత్రానికి రామ్ లక్ష్మణ్ పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్స్ అందించినట్లు టాక్. ప్రస్తుతం ఆచార్య చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంటోంది. టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది.

More News

అల్ట్రా స్టైలిష్ లుక్ లో సత్యదేవ్.. సెకండ్ తర్వాత ఫస్ట్ మూవీ ఇదే

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడు సత్యదేవ్ దూసుకుపోతున్నాడు. ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన మార్క్ చాటుకుంటున్నాడు.

బిగిల్ సినిమా చూపించి చికిత్స.. డాక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి

పేషంట్లని డాక్టర్లు ప్రేమించాలని, ఫ్రెండ్లీగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో చూశాం.

బిజీగా పుష్పరాజ్.. రంగంలోకి రంగమ్మత్త!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.

'జీ 5'లో జూలై 9న ఒరిజినల్‌ మూవీ 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ : టెంపుల్‌ అటాక్‌' విడుదల

ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్ కోరుకునే వీక్షకుల కోసం వివిధ భాషలు, వివిధ జోనర్లలో అర్థవంతమైన, ప్రయోజనకరమైన కంటెంట్‌ అందించే భారతదేశపు అతి పెద్ద ఓటీటీ వేదిక 'జీ 5'.

మా బావగారు అంటూ వైఎస్ఆర్ పై మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు.