అడవి శేష్ తో అభిషేక్ అగర్వాల్ (ఎ.సి.ఎల్)

  • IndiaGlitz, [Friday,July 01 2016]

క్ష‌ణం సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు క‌థ - స్ర్కీన్ ప్లే అందించి ఘ‌న విజ‌యం సాధించిన‌ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్. క్ష‌ణం సినిమాకి ముందు బాహుబ‌లి, పంజా, కిస్, క‌ర్మ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించినా...అడ‌వి శేష్ కి హీరోగా స‌క్సెస్ అందించించిన చిత్రం మాత్రం క్ష‌ణం. విభిన్న క‌థాంశంతో రూపొందిన‌ క్ష‌ణం ఇచ్చిన విజ‌యంతో ఫుల్ బిజీ అయిపోయాడు శేష్. ఈ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్ తో అభిషేక్ అగ‌ర్వాల్ రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌, సుప్రీమ్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసారు. పంపిణీ రంగంలో విజ‌యం సాధించిన అభిషేక్ అగ‌ర్వాల్ ఇప్పుడు విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో నిర్మాణ రంగంలో ప్ర‌వేశిస్తున్నారు.
అభిషేక్ సినిమాస్ ఇండియా లిమిటెడ్ బ్యాన‌ర్ పై విభిన్న క‌థా చిత్రాల‌ను నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్ర‌య‌త్నంగా అడ‌వి శేష్ తో రెండు చిత్రాల‌ను నిర్మించ‌నున్నారు. ఇందులో ఒక చిత్రానికి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌లిసి డైరెక్ట్ చేస్తుండ‌డం విశేషం. మ‌రో చిత్రాన్ని వేరే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నారు. ఈ రెండు చిత్రాల్లోను అడ‌వి శేష్ హీరోగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ రెండు చిత్రాల్లో ఒక చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అభిషేక్ అగ‌ర్వాల్ అడ‌వి శేష్ తో నిర్మిస్తున్నఈ రెండు చిత్రాల‌తో పాటు స్టార్ హీరోతో బిగ్ బ‌డ్జెట్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. వీటి పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌చేయ‌నున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్ గా స‌క్సెస్ సాధించి...ప్రొడ్యూస‌ర్ గా మంచి చిత్రాల‌ను అందించాల‌నే ఉద్దేశ్యంతో నిర్మాత‌గా మారుతున్నఅభిషేక్ అగ‌ర్వాల్ ఆల్ ది బెస్ట్..!

More News

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సైమా సెల్ఫీ

సింగపూర్ లో జరుగుతున్న సైమా వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే.

రవితేజ డైలాగ్ - నాని మూవీ టైటిల్..

భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ,జెంటిల్ మన్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో నాని.

విక్రమ్ న్యూమూవీ ఇంకొక్కడు టీజర్ రిలీజ్

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరు ముగన్.

ఈరోజు సింహంలా గర్జించిన రజనీ..

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మెగాస్టార్ రీ ఎంట్రీ పై కామెంట్ చేసిన అఖిల్..

మెగాస్టార్ 150వ చిత్రం గురించి అటు అభిమానులు-ఇటు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.