close
Choose your channels

అడవి శేష్ తో అభిషేక్ అగర్వాల్ (ఎ.సి.ఎల్)

Friday, July 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్ష‌ణం సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు క‌థ - స్ర్కీన్ ప్లే అందించి ఘ‌న విజ‌యం సాధించిన‌ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్. క్ష‌ణం సినిమాకి ముందు బాహుబ‌లి, పంజా, కిస్, క‌ర్మ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించినా...అడ‌వి శేష్ కి హీరోగా స‌క్సెస్ అందించించిన చిత్రం మాత్రం క్ష‌ణం. విభిన్న క‌థాంశంతో రూపొందిన‌ క్ష‌ణం ఇచ్చిన విజ‌యంతో ఫుల్ బిజీ అయిపోయాడు శేష్. ఈ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్ తో అభిషేక్ అగ‌ర్వాల్ రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌, సుప్రీమ్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసారు. పంపిణీ రంగంలో విజ‌యం సాధించిన అభిషేక్ అగ‌ర్వాల్ ఇప్పుడు విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో నిర్మాణ రంగంలో ప్ర‌వేశిస్తున్నారు.
అభిషేక్ సినిమాస్ ఇండియా లిమిటెడ్ బ్యాన‌ర్ పై విభిన్న క‌థా చిత్రాల‌ను నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్ర‌య‌త్నంగా అడ‌వి శేష్ తో రెండు చిత్రాల‌ను నిర్మించ‌నున్నారు. ఇందులో ఒక చిత్రానికి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌లిసి డైరెక్ట్ చేస్తుండ‌డం విశేషం. మ‌రో చిత్రాన్ని వేరే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నారు. ఈ రెండు చిత్రాల్లోను అడ‌వి శేష్ హీరోగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ రెండు చిత్రాల్లో ఒక చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అభిషేక్ అగ‌ర్వాల్ అడ‌వి శేష్ తో నిర్మిస్తున్నఈ రెండు చిత్రాల‌తో పాటు స్టార్ హీరోతో బిగ్ బ‌డ్జెట్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. వీటి పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌చేయ‌నున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్ గా స‌క్సెస్ సాధించి...ప్రొడ్యూస‌ర్ గా మంచి చిత్రాల‌ను అందించాల‌నే ఉద్దేశ్యంతో నిర్మాత‌గా మారుతున్నఅభిషేక్ అగ‌ర్వాల్ ఆల్ ది బెస్ట్..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.