చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో....

  • IndiaGlitz, [Monday,September 10 2018]

సూప‌ర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లో కూడా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు. విల‌క్ష‌ణ‌మైన విల‌నిజంతో మెప్పించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. వివ‌రాల్లోకెళ్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో విల‌న్‌గా సోనూసూద్ న‌టిస్తున్నారు. అది కూడా రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో. 'తేజ క‌థ‌ను నెరేట్ చేసిన త‌ర్వాత వ‌ద్దు అన‌డానికి నాకు న‌చ్చ‌లేదు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌ని ఓ డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను' అన్నారు సోనూసూద్‌. మ‌ణిక‌ర్ణిక సినిమా నుండి అర్ధాంత‌రంగా త‌ప్పుకున్న ఈయ‌న బాలీవుడ్ పి.వి.సింధు బ‌యోపిక్‌లో కూడా న‌టించ‌బోతున్నారు.

More News

'క‌ల్కి' కోసం భారీ సెట్‌...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'క‌ల్కి'. రాఖీ సంద‌ర్భంగా ఇటీవ‌ల సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

రెండు ఫార్మేట్స్‌లో '2.0'

ఎప్పుడో ఆగ‌స్ట్‌లో '2.0' టీజ‌ర్ వ‌స్తుంద‌నుకుంటే ఆల‌స్య‌మైందేంటి?  వినాయ‌క చ‌వితికి టీజ‌ర్ వ‌స్తుందో రాదో? అనే సందేహం ఉండేది.

కొడుకు సినిమా గురించి చెప్పిన శ్రీకాంత్‌

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ తొలి సినిమా నిర్మలా కాన్వెంట్‌.

'కురుక్షేత్రం' సెప్టెంబర్‌ 13న విడుదల

యాక్షన్ కింగ్‌ అర్జున్‌ నటించిన 150 సినిమా 'కురుక్షేత్రం'. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 13న విడుదల అవుతుంది.

ఆది స‌ర‌స‌న మిస్తీ..

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు  తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు..