అఖిల్ సెకండ్ మూవీ ఎనౌన్స్ మెంట్ ఆరోజే..

  • IndiaGlitz, [Wednesday,April 06 2016]
అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో...ద్వితీయ చిత్రం పైనే అంద‌రి ఆశ‌లు. నాగార్జున కూడా ఈసారి అఖిల్ రెండో సినిమాని నేనే ద‌గ్గ‌రుండి చూసుకుంటాను. ఈ సినిమా మాత్రం నా ఇష్ట‌ప్ర‌కార‌మే జ‌రుగుతుంది అన్నారు. దీంతో అఖిల్ సెకండ్ మూవీని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
అఖిల్ సెకండ్ మూవీకి వంశీ పైడిప‌ల్లి డైరెక్ట‌ర్ క‌న్ ఫ‌ర్మ్ అనే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగార్జున - పి.వి.పి సంయుక్తంగా నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. అంతా ఓకే. ఇంత‌కీ ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు అనే క‌దా..ఈ ఉగాది రోజున ఇండ‌స్ట్రీలో స‌ర్ధార్ సినిమా రిలీజ్, బాల‌య్య వందో సినిమా ఎనౌన్స్ మెంట్, వెంకీ బాబు..బంగారం ఫ‌స్ట్ లుక్... ఇలా చాలా ఉన్నాయి. వీట‌న్నింటితో పాటు అఖిల్ పుట్టిన‌రోజు కూడా ఉగాది రోజునే. అందుచేత అఖిల్ త‌న సెకండ్ మూవీని ఆరోజు ఎనౌన్స్ చేస్తాడ‌ని టాక్. మ‌రి... పుట్టిన‌రోజు నాడు అఖిల్ ఏం చేస్తాడో..ఫ్యాన్స్ కి ఎలాంటి న్యూస్ అందిస్తాడో చూడాలి.

More News

'గరుడ' ఆలస్యమవుతుంది...

తెలుగులో రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న గరుడ సినిమా కాదు..తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న గరుడ

నితిన్ అ ఆ వాయిదా..

నితిన్, సమంత జంట‌గా న‌టిస్తున్న‌ చిత్రం  అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

యాంకర్ జయతి ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం లచ్చి..

వెన్నెల ప్రొగ్రామ్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ జయతి కధానాయికగా నటిస్తూ...నిర్మిస్తున్న చిత్రం లచ్చి.

'24' చిత్రం నాకు మంచి బ్రేక్ ఇస్తుంది - అజయ్

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించిన నటుడు అజయ్.

కుమారి దర్శకుడితో శర్వానంద్..

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్