ఆ డైరెక్ట‌ర్ కోసం అఖిల్ వెయిటింగ్..

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

అక్కినేని అఖిల్ న‌టించిన తొలి చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో అఖిల్ రెండో సినిమాతో ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాలి. అందుకోసం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అయితేనే క‌రెక్ట్ అని ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం నితిన్ తో అ ఆ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం జ‌న‌వ‌రికి పూర్త‌వుతుంది. ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అవుతుంది.

ఈ మూవీ త‌ర్వాత త్రివిక్ర‌మ్ అఖిల్ తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించార‌ట‌. అఖిల్, త్రివిక్ర‌మ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందే ఈ మూవీని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు. డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందే ఈ చిత్రం జ‌న‌వ‌రి నెలాఖ‌రున ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఇదే క‌నుక నిజ‌మైతే అఖిల్..మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో విజ‌యం సాధించ‌డం ఖాయం.

More News

క‌థానాయిక నుంచి ప్ర‌తినాయిక‌గా మారిన హీరోయిన్..

క‌థానాయిక నుంచి ప్ర‌తినాయిక‌గా మారింది ఓ హీరోయిన్. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆమె అంజ‌లి.

నయన, అనుష్క, త్రిష ... టాప్ 3

రెమ్యూనరేషన్ విషయంలో టాప్ 3 హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు పదేళ్లుగా రాణిస్తున్న సీనియర్ హీరోయిన్లు నయనతార, అనుష్క,త్రిష.టాలీవుడ్ లో వీరి రెమ్యూనరేషన్ రేంజ్ మంచి స్థాయిలో ఉన్నా..

రోబో 2 త‌ర్వాత భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంక‌ర్..

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తాజాగా రోబో 2 మూవీ తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

బాల‌య్య పేరుని టాటూగా వేసుకున్నయంగ్ హీరో

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య పేరుని యంగ్ హీరో నాని టాటూగా వేసుకున్నారు.

ప్ర‌కాష్ కొవెల‌మూడికి బంపర్ ఆఫ‌ర్..

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తాజాగా తెర‌కెక్కించిన చిత్రం సైజ్ జీరో.