'థ్యాంక్యూ' టీజర్‌

ఈ ఏడాది లవ్‌స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తనకు సూటయ్యే కథలతో దూసుకెళ్తున్నారు. యూత్, ప్రేమ కథలను చేస్తూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా చైతూ నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి దృశ్య కావ్యాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసిన మేకర్స్ దీనిలో భాగంగా బుధవారం థ్యాంక్యూ టీజర్‌ను రిలీజ్ చేశారు. బిజినెస్ టైకూన్ అభిరామ్ పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నారు. ఓ సాధారణ కుర్రాడి నుంచి ఈ స్థాయికి ఆయన ఎదిగినట్లు చూపించారు. ఈ జర్నీలో అతనికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఆయన స్కూల్‌లో మాళవిక నాయర్‌తో, స్పోర్ట్స్ పర్సన్‌గా ఉన్నప్పుడు అవికా గోర్‌తో, బిజినెస్‌ మ్యాన్‌గా ఎదిగాక రాశీఖన్నాతో ప్రేమలో పడటాన్ని చూపించారు.

నువు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్ లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు అని హీరోయిన్ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను, ఇక లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే .. అంటూ చైతూ చెప్పిన డైలాగ్ ఆలోచింపజేస్తోంది.

థ్యాంక్యూలో నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బీవీయస్ రవి ఈ సినిమాకు కథ అందించగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

More News

ఎఫ్2కి మించిన వినోదం ఎఫ్3లో... పక్కాగా రిపీట్ ఆడియన్స్ వస్తారు: అనిల్ రావిపూడి

''తెలుగు ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరిస్ వుండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్ ని చేశాం.

అప్పుడే అంబేద్కర్ పేరు పెట్టాల్సింది.. జగన్‌ ఊగిసలాట వల్లే ఇలా : కోనసీమ అల్లర్లపై సీపీఐ నారాయణ

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దంటూ అమలాపురంలో మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా

ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది: విక్టరీ వెంకటేష్

''ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులో పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు.

మీ ఫెయిల్యూర్స్ జనసేనపై రుద్దుతారా .. వివాదాలకు ‘అంబేద్కర్’ను వాడొద్దు : అమలాపురం అల్లర్లపై పవన్ స్పందన

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దంటూ జేఏసీ మంగళవారం నిర్వహించిన ఆందోళన అమలాపురంలో హింసాత్మక పరిస్ధితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

కోనసీమ జిల్లా పేరు మార్పు : అమలాపురంలో హైటెన్షన్.. మంత్రి విశ్వరూప్, ఎంఎల్‌ఏ సతీశ్ ఇంటికి నిప్పు

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దంటూ ఆ ప్రాంతవాసులు మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపు