విరాటపర్వంలో 'అల వైకుంఠపురములో' నటి.. అందాల భామ నక్సలైట్ గా..

  • IndiaGlitz, [Saturday,July 17 2021]

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. నక్సలిజం బ్యాడ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.

కథలో నక్సలిజం ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. సాయి పల్లవి, రానా మధ్య సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ చిత్రంలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి, నందిత దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

అందాల భామ నివేద పేతురాజ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరవనుంది. స్వయంగా నివేదా పేతురాజ్ ఈ విషయాన్ని ప్రకటించింది. తనది గెస్ట్ రోల్ అయినప్పటికీ చాలా కీలకమైన పాత్ర అని నివేదా తెలిపింది. నక్సలైట్ రోల్ లో కనిపించబోతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తన పాత్ర షూటింగ్ పూర్తయిందని నివేదా పేతురాజ్ తెలిపింది. కేవలం మూడు రోజుల్లోనే షూటింగ్ ముగిసింది.

కానీ ఆ మూడు రోజుల పాటు చాలా ఎఫోర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. నటన పరంగా ఇది చాలా టఫ్ చిత్రం. నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ లో నటించా. వర్షం పడుతున్నప్పటికీ మేము యాక్షన్ సన్నివేశాల్లో నటించాం. ఇది నాకు అద్భుతమైన ఏపీరియన్స్ అని నివేదా పేర్కొంది.

ఇక నివేదా తన గురించి మాట్లాడుతూ.. నటన పరంగా నేను ఎవ్వరితోనూ పోల్చుకోను. నాకు నేను యూనిక్ గా ఫీల్ అవుతాను అని తెలిపింది. ఇక తనకు సాహసోపేతమైన ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం అని నివేదా పేర్కొంది. 2015లో తాను నేపాల్ లోని అన్నపూర్ణ బేస్ కు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లినట్లు నివేద తెలిపింది. తీవ్రమైన చలిలో ఎందుకు వెళుతున్నావు అని చాలా మంది అడిగారు.

అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఒంటి నొప్పులు ఉన్నప్పటికీ తాను తన జర్నీ పూర్తి చేసినట్లు నివేద తెలిపింది. నివేద పేతురాజ్ తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురములో లాంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

More News

'కుడి ఎడమైతే' వెబ్ సిరీస్ రివ్యూ

ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ఒరిజినల్ వెబ్ సిరీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా నేడు ఆహా మరో వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. టైటిల్ తోనే ఆసక్తిరేపిన వెబ్ సిరీస్ 'కుడి ఎడమైతే'.

క్రేజీ విలన్ కూతురితో స్టార్ క్రికెటర్ రొమాన్స్.. మామగారు కూడా బౌల్డ్

క్రికెటర్స్ తో బాలీవుడ్ భామలు.. ఇది ఎప్పటికి నెవర్ ఎండింగ్ స్టోరీ అనే చెప్పాలి.

RRR కంటే ముందుగానే.. బుల్లితెరపై అల్లూరి, కొమరం భీం?

ఆర్ఆర్ఆర్ టీం విడుదల చేసిన మేకింగ్ వీడియో రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ప్రభాస్ లుక్ లోకి మారిపోయిన బెల్లంకొండ.. లాంచ్ చేసిన రాజమౌళి!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య సర్ స్టార్ కావడానికి కారణం అదే.. ప్రగ్యా జైశ్వాల్ కామెంట్స్!

అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి ప్రగ్యా జైశ్వాల్. కొంత అదృష్టం కూడా ఉండి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది.