ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై ఆగ్రహం.. స్పందించిన అలియా, సింగిల్‌ పోస్ట్‌తో అందరికీ ఇచ్చిపడేసిందిగా

  • IndiaGlitz, [Friday,April 01 2022]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. సౌత్ , నార్త్ అన్న తేడా లేకుండా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రతిఒక్కరూ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌లో నటించిన హీరోలు, టెక్నీషియన్లు కూడా సినిమా చూసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఒక్కరు మాత్రం ఇంత వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అది ఎవరో కాదు అలియా భట్. ఆర్ఆర్ఆర్‌లో తన పాత్ర నిడివి తక్కువగా వున్న కారణంతో ఆమె చిత్ర యూనిట్‌పై కోపంగా వుందని.. అందుకే ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన పోస్ట్‌లన్నింటినీ తన ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే సినిమా విడుదలై వారం గడుస్తున్నా ఎలాంటి స్పందనా తెలియజేయలేదని గాసిప్స్ వినిపించాయి.

ఈ నేపథ్యంలో పుకార్లకు చెక్ పెట్టింది అలియా భట్. ‘‘ తక్కువ పోస్ట్‌లు ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఎప్పటికప్పుడు పాత వీడియోలను తొలగిస్తుంటానని .. దీనికే ఏదేదో ఆపాదించుకుంటే ఎలా? ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే ప్రపంచంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో నేను పోషించిన సీత పాత్రను ఎంతగానో ప్రేమించా. రాజమౌళి సర్‌, తారక్‌, చరణ్‌లతో కలిసి పనిచేయడాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఆర్ఆర్ఆర్ కోసం పనిచేసిన ప్రతి క్షణం మధురానుభూతినిచ్చింది. రాజమౌళి సర్‌, ఆయన టీమ్‌ ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. నా విషయంగా ఈ సినిమాపై వస్తున్న అవాస్తవాలను ఖండిస్తున్నా. తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఎప్పుడూ అంగీకరించను’’ అని అలియా భట్‌ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More News

నాగార్జున చేతుల మీదుగా విడులైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గాలివాన’ ట్రైలర్‌

పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నుండి కామెడీ డ్రామా ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ మరియు అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి ‘‘లూజర్‌’’

హైదరాబాదీలకు బంపరాఫర్.. రూ.59తో మెట్రోలో రోజంతా ప్రయాణం, కానీ..?

ప్రజలను ట్రాఫిక్ కష్టాలకు దూరంగా, సుఖమయ, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోన్న హైదరాబాద్‌ మెట్రో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది.

వరంగల్ ఎంజీఎంలో దారుణం: ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి..  విచక్షణారహితంగా కొరికేసిన మూషికాలు

వేలు, లక్షలు పోసి కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.

ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే..?

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది.

రాజ‌కీయాల‌లోకి అనవసరంగా వెళ్లా.. తాప్సీతో ఛాన్స్ మిస్ అయ్యా: చిరు హాట్ కామెంట్స్

అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ పన్ను  తర్వాత బాలీవుడ్ చెక్కేసిన సంగతి తెలిసిందే.