'రంగం 2' ఆడియో వేడుకకు 'రంగం' సిద్ధం!!

  • IndiaGlitz, [Wednesday,October 19 2016]

సూపర్‌గుడ్‌ మూవీస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జీవా నటించిన రంగం' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో జీవా సరసన నిన్నటి తరం బ్యూటీక్వీన్‌ రాధ పెద్ద కుమార్తె కార్తీక నటించింది. మరో ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ రవి.కె.చంద్రన్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తమిళంలో రూపొందించిన యాన్‌' చిత్రాన్ని తెలుగులో రంగం-2' పేరుతో అనువదిస్తున్నారు. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో' శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రంగం' చిత్రానికి సంగీతం సమకూర్చి..

ఆ చిత్రం సాధించిన సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించిన సంగీత సంచలనం హ్యారిస్‌ జైరాజ్‌ రంగం-2' చిత్రానికి కూడా సంగీత సారధ్యం వహించగా' రాధ చిన్న కుమార్తె తులసీ నాయర్‌ ఈ చిత్రంలో జీవాతో జత కట్టింది. వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చగా ప్రముఖ గాయనీగాయకులు ఆలపించిన రంగం-2' గీతాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. హీరోహీరోయిన్‌లు జీవా' తులసీ నాయర్‌తోపాటు సంగీతదర్శకులు హ్యారిస్‌ జైరాజ్‌ సమక్షంలో రంగం-2' ఆడియో వేడుక వైభవంగా నిర్వహించేందుకు చిత్ర నిర్మాత ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) సన్నాహాలు చేస్తున్నారు.

నాజర్‌, జయప్రకాష్‌, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌, సమర్పణ: జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, నిర్మాత: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్‌!!

More News

'ఇంట్లో దెయ్యం...నాకేం భయం' టీజర్ రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్ టైన్ చేశాయి.

న‌క్ష‌త్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ లుక్ రిలీజ్ చేసిన చ‌ర‌ణ్..!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు. కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ ఈ చిత్రంలో ఓ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తుంది.

మ‌హేష్ అలా....జ‌రిగితే అద్భుతం అన్నారు ఆత‌ర్వాత‌ షాక్ అయ్యారు - హీరో న‌వీన్ విజ‌య‌కృష్ణ‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&

ఉక్రెయిన్ కు చిరు...

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

నవంబర్ 4 న విడుదల కానున్న 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'భాహుబలి'చిత్రంతో కాళకేయ గా సినిమా ప్రేక్షకుల ప్రశంశలు పొందిన ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం 'ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి'..