close
Choose your channels

మ‌హేష్ అలా....జ‌రిగితే అద్భుతం అన్నారు ఆత‌ర్వాత‌ షాక్ అయ్యారు - హీరో న‌వీన్ విజ‌య‌కృష్ణ‌

Tuesday, October 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సంయుక్తంగా నిర్మించారు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రం ఈనెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా నందిని న‌ర్సింగ్ హోమ్ గురించి హీరో న‌వీన్ వికె తో ఇంట‌ర్ వ్యూ మీకోసం..!

నంద‌ని న‌ర్సింగ్ హోమ్ కాన్సెప్ట్ ఏమిటి..?

నంద‌ని న‌ర్సింగ్ హోమ్ లోనే సినిమా స్టార్ట్ అవుతుంది. డ‌బ్బులు కోసం అనుకోకుండా డాక్ట‌ర్ అవుతాను. ఏమీ తెలియ‌కుండా డాక్ట‌ర్ అయిన నేను ఎలా మేనేజ్ చేసాను అనేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా, స‌రదాగా ఉంటుంది. నేను డాక్ట‌ర్ గా వ‌ర్క్ చేసే హాస్ప‌ట‌ల్ కి ఛైర్మ‌న్ గా నిత్యా న‌టించింది. ఆమె ఏ త‌ప్పు జ‌రిగినా ఇట్టే క‌నిపెట్టేస్తుంటుంది. అలాంటిది ఆమె క‌నిపెట్ట‌కుండా ఉండేలా నేను ఏం చేసాను..? మ‌నుషులు ముఖ్యం అనుకునే నేను మ‌న‌సు మార్చుకుని ఎందుకు డ‌బ్బులే ముఖ్యం అనుకుంటాను. ఫైన‌ల్ గా నందిని న‌ర్సింగ్ హోమ్ లో ఏం జ‌రిగింది అనేదే కాన్సెప్ట్..!

డాక్ట‌ర్ చ‌ద‌వ‌కుండా డాక్ట‌ర్ గా చేయ‌డం అంటే శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్ గుర్తుకువ‌స్తుంది. ఆ సినిమాతో పోలిక‌లు ఏమైనా ఉంటాయా..?

మీరు చెప్పిన ఆ ఒక్క పోలికే త‌ప్పా...ఇంక ఎలాంటి పోలిక‌లు ఉండ‌వు.

ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేసిన మీరు హీరోగా మార‌డానికి కార‌ణం ఏమిటి..?

హీరో అవ్వాల‌ని చిన్న‌ప్ప‌టి నుంచి ఉంది. అయితే...ఇంట‌ర్మీడియ‌ట్ టైమ్ లో యానిమేష‌న్ చూసి...ఇదేదో ఇంట్ర‌స్టింగ్ గా ఉంది అనిపించి యానిమేష‌న్ నేర్చుకున్నాను. ఆత‌ర్వాత యానిమేష‌న్ బోర్ కొట్టి ఎడిటింగ్ నేర్చుకున్నాను. రానా షార్ట్ ఫిల్మ్ తీస్తే...ఆ షార్ట్ ఫిల్మ్ కి నేను ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేసాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి కృష్ణ‌వంశీ గారు ఎడిటింగ్ బాగుంది అని మెచ్చుకుని డేంజ‌ర్ సినిమాకి ఎడిట‌ర్ గా అవ‌కాశం ఇచ్చారు. ఆత‌ర్వాత కృష్ణ‌వంశీ గారి సినిమాలు రాఖీ, చంద‌మామ సినిమాల‌కు ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేసాను. అయితే...ఎడిట‌ర్ గా డే & నైట్ వ‌ర్క్ చేయ‌డం వ‌ల‌న హెల్త్ ప్రొబ్ల‌మ్స్ వ‌చ్చాయి. డాక్ట‌ర్ ను సంప్ర‌దిస్తే...నువ్వు 30 ఏళ్లు క‌న్నా ఎక్కువ బ‌త‌క‌వు అన్నారు. అప్ప‌డు 130 కేజీలు ఉండేవాడిని. ఇంట్లో చెబితే...ఎడిటింగ్ మానేసి ఏక్టింగ్ చేస్తే బాగుంటుంది అన్నారు. నాకు కూడా చిన్న‌ప్ప‌టి నుంచి మ‌న‌సులో ఉండ‌డం వ‌ల‌న వెంట‌నే ఓకే చెప్పాను. 130 కేజీలు బ‌రువు ఉన్న‌వాడిని 3 సంవ‌త్స‌రాల్లో 75 కేజీలు వ‌ర‌కు త‌గ్గాను. ఫైన‌ల్ గా నందిని న‌ర్సింగ్ హోమ్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను.

ఈ సినిమా కంటే ముందు అడ్డాల చంటి నిర్మాణంలో సినిమా ప్రారంభించారు క‌దా..? ఆ సినిమా ఏమైంది..?

సినిమా దాదాపు పూర్త‌య్యింది. కొంచెం ప్యాచ్ వ‌ర్క్ చేయాలి. అలాగే కొన్ని సీన్స్ రీషూట్ చేయాలి అనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో నందిని న‌ర్సింగ్ హోమ్ ప్రాజెక్ట్ వ‌చ్చింది. క‌థ ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో ముందు ఈ సినిమా చేద్దాం అని స్టార్ట్ చేసాం. ఆ సినిమాని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌నేది ప్లాన్.

అత‌డు, ఖ‌లేజా సినిమాల‌కి ట్రైల‌ర్స్ మీరే క‌ట్ చేసారు క‌దా..? హీరో అవ్వాల‌నుకుంటున్నాను అని మ‌హేష్ కి చెప్పిన‌ప్పుడు ఏమ‌న్నారు..?

ఖ‌లేజా సినిమా టైమ్ లో హీరో అవ్వాల‌నుకుంటున్నాను అని మ‌హేష్ కి చెప్పాను. అప్పుడు నా బ‌రువు 130 కేజీలు. హీరో అవ్వాలంటే నువ్వు బాగా త‌గ్గాలి నువ్వు బ‌రువు త‌గ్గు చూద్దాం. త‌గ్గితే మిరాకిలే అన్నారు. నేను బ‌రువు త‌గ్గాల‌ని చాలా హార్డ్ వ‌ర్క్ చేసాను. అయితే...నేను బ‌రువు త‌గ్గ‌నేమో అనే భ‌యంతోనే కొంచెం త‌గ్గిపోయాను. ఆత‌ర్వాత ఓరోజు ఫంక్ష‌న్ లో న‌న్ను చూసి మ‌హేష్ షాక్ అయ్యారు. ఈ మూవీ ట్రైల‌ర్ చూసి మ‌హేష్ బాగుంది అని చెప్ప‌డంతో హ్యాపీగా ఫీల‌య్యాను.

ఏక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారా..? నాన్న‌, నాన్న‌మ్మ ఏమైనా స‌ల‌హాలు ఇచ్చేవారా..?

స‌త్యానంద్ గారి ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకున్నాను. స‌త్యానంద్ గారు నా ఏక్టింగ్ చూసి చ‌లం గారిలా చేస్తున్నాడు మంచి భ‌విష్య‌త్ ఉంది అని మా నాన్న‌గార్కి ఫోన్ చేసి చెప్పార‌ట‌. ఇక స‌ల‌హాలు ఉంటే...నాన్న అయితే...ప్ర‌జెంట్ ఎలాంటి సినిమాలు వ‌స్తున్నాయి. నేను ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని స‌ల‌హాలు ఇస్తుంటారు. నాన్న‌మ్మ అయితే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేది చెబుతుంటారు.

సినిమా చూసుంటారు క‌దా చూసిన‌ప్పుడు ఎలా అనిపించింది..?

నేను డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్పుడు కొంచెం చూసాను అంతే.. సినిమా అంతా చూడ‌లేదు..! అచ్చు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నేను ఓ సీన్ చూసాను. అది నాకు చాలా బాగా న‌చ్చింది. ఈ సీన్ చూసాకా చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. సినిమాని ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో థియేట‌ర్ లోనే చూడాలి అనుకుంటున్నాను.

నందిని న‌ర్సింగ్ హోమ్ ఆడియోన్స్ కు ఎలాంటి అనుభూతి క‌లిగిస్తుంది..?

ఈ సినిమాలో ష‌క‌ల‌క శంక‌ర్ నా ఫ్రెండ్ గా న‌టించాడు. ఎంట‌ర్ టైన్మెంట్ అనేది సినిమా అంతా ఉంటుంది. ఎంట‌ర్ టైన్మెంట్ తో పాటు ఎమోష‌న్ కూడా ఉంటుంది. సినిమా అంతా చూసిన త‌ర్వాత ఆడియోన్స్ ధియేట‌ర్ నుంచి ఓ మంచి ఫీల్ తో బ‌య‌ట‌కు వ‌స్తారు. ఖ‌చ్చితంగా అంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంది అనేది మా గ‌ట్టి న‌మ్మ‌కం.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?

అడ్డాల చంటి గారు బ్యాన‌ర్ లో రూపొందుతున్న సినిమాని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేస్తాం. టు ప్రాజెక్ట్స్ గురించి డిష్క‌స‌న్స్ జ‌రుగుతున్నాయి. ఒక సినిమాని న‌వంబ‌ర్ లో, రెండో సినిమాని సంక్రాంతికి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.