రవిప్రకాష్ గుట్టు రట్టు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

  • IndiaGlitz, [Friday,May 17 2019]

టీవీ9 రవిప్రకాష్ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నేషనల్ ట్రిబ్యునల్, హైకోర్టులో రవిప్రకాష్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవిప్రకాష్‌పై మరోకేసు నమోదైంది. సైబర్‌బాద్ సైబర్ క్రైమ్‌ పోలీసుల ఎదుట ఇంతవరకూ హాజరుకాకపోవడంతో రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. సైబరాబాద్‌ పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు రవిప్రకాష్‌ ఇంత వరకూ స్పందించకపోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

అయితే.. నోటీసులకు రవిప్రకాష్ రియాక్ట్ అవుతూ విచారణకు 10 రోజులు గడువు కావాలని మెయిల్‌లో కోరారు. వ్యక్తిగతంగా హాజరుకాని నేపథ్యంలో ఇక అరెస్ట్‌లే ఉంటాయని పోలీసులు స్పష్టం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గిన రవిప్రకాష్ పది రోజులు గడువు కోరారు. కాగా ఇప్పటి వరకూ రవిప్రకాష్‌పై మొత్తం సైబరాబాద్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. రవిప్రకాష్ చేసిన ఈ-మెయిల్స్‌ వ్యవహారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ అధికారిక ఈ-మెయిల్‌కు సందేశం పంపినట్లు తెలుస్తోంది.

మరోవైపు సినీనటుడు శివాజీ కూడా తాను అనారోగ్యంతో బాధ పడుతున్నానని, కేసు విచారణకు హాజరయ్యేందుకు 10 రోజుల గడవు కావాలని ఈ-మెయిల్‌ సందేశం పంపినట్లు సమాచారం. అయితే రవిప్రకాష్, శివాజీ ఇద్దరూ ఎక్కడ్నుంచి మెయిల్ చేశారని.. ఎక్కడున్నారు..? మొత్తం ఐపీ అడ్రస్‌ ద్వారా ఆచూకి తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారిద్దరూ ఒకే చోట ఉన్నారా..? లేకుంటే వేర్వేరు ప్రాంతాల నుంచి మెయిల్ చేశారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. సో.. రవిప్రకాష్, శివాజీ ఎక్కడున్నది పోలీసులకు దాదాపు తెలిసిపోయిందన్న మాట. వీలైనంత త్వరలోనే రవిప్రకాష్, శివాజీని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

More News

సీనియర్ నటుడు ‘రాళ్లపల్లి’ కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్ళపల్లి నరసింహారావు(73) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్లపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మ‌ళ్లీ 'ద‌డ‌' జోడీ.. 

నాగ‌చైత‌న్య‌కు ఇప్పుడు మంచి ఫేజ్ న‌డుస్తోంది. పెళ్ల‌య్యాక స‌తీమ‌ణి స‌మంత‌తో క‌లిసి చేసిన తొలి సినిమా 'మ‌జిలీ' ఆయ‌న‌కు సూప‌ర్ స‌క్సెస్ ఇచ్చింది. ఈ స‌మ్మ‌ర్‌లో బెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా బోణీకొట్టింది.

రెబ‌ల్ స్టారూ.. 30 కోట్లూ...

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించే సినిమా సెట్లు కోసం విప‌రీతంగా ఖ‌ర్చుపెడుతున్నార‌ట‌. అయితే ఇంత‌కీ ఆ సినిమా సాహోనా? ఆ త‌ర్వాతి సినిమానా? అనేగా అనుమానం.

కేసీఆర్ మాకు మిత్రుడే.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుకై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వెళ్లిన ఆయన..

ఆ హీరోని బ‌యోపిక్‌కి అడ‌గ‌లేద‌ట‌

`నేను బ‌యోపిక్‌లో న‌టిస్తాన‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ న‌న్ను బ‌యోపిక్‌ కోసం ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు.