close
Choose your channels

రెబ‌ల్ స్టారూ.. 30 కోట్లూ...

Friday, May 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెబ‌ల్ స్టారూ.. 30 కోట్లూ...

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించే సినిమా సెట్లు కోసం విప‌రీతంగా ఖ‌ర్చుపెడుతున్నార‌ట‌. అయితే ఇంత‌కీ ఆ సినిమా సాహోనా? ఆ త‌ర్వాతి సినిమానా? అనేగా అనుమానం. 'సాహో' మాత్రం కాదు. ఆ త‌ర్వాతి చిత్ర‌మే. 'సాహో' షూటింగ్ ఫైన‌ల్ స్టేజుల్లో ఉంది. ఈ నెలాఖ‌రుకు ఈ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ఓ పీరియాడిక్ రొమాంటిక్ చిత్రంలో న‌టిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. 1970ల్లో ప‌రిస‌రాల‌ను ప్ర‌తిబింబించ‌డం కోసం ఈ సినిమాను కొంత‌మేర విదేశాల్లో చిత్రీక‌రించారు. అయితే ప్ర‌తిసారీ ఆర్టిస్టులంద‌రినీ అంతంత దూరం తీసుకెళ్ల‌డానికి బోలెడంత శ్ర‌మ అవుతుంది.

అందుకే సినిమా సెట్లు హైద‌రాబాద్ ఔట్‌స్క‌ర్టుల్లో వేశారు. ఒక సెట్టుకే రూ.30కోట్లు ఖ‌ర్చుపెట్టిన‌ట్టు స‌మాచారం. దీన్ని బ‌ట్టి ఈ సినిమాను ఎంత భారీగా తీస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే నాయిక‌. వ‌చ్చే ఏడాది వేస‌వికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.