బాలీవుడ్ ఎంట్రీ గురించి బ‌న్నీ ఏమ‌న్నాడో తెలుసా?

  • IndiaGlitz, [Tuesday,February 04 2020]

'బాహుబ‌లి', 'కె.జి.య‌ఫ్ పార్ట్ 1' చిత్రాల త‌ర్వాత ద‌క్షిణాది చిత్రాల‌కు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. 'సాహో', 'సైరా', 'ప‌హిల్వాన్‌', 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ' వంటి ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాణించాల‌నుకున్న మేర‌కు రాణించలేక ఊసుర‌మ‌నిపించాయి. అయితే కూడా ఇప్పుడు ప‌లు సౌత్ సినిమాలు బాలీవుడ్‌పై దండ‌యాత్ర‌లు చేయ‌డం స్టార్ట్ చేశాయి. ఈ క్ర‌మంలో తెలుగులో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెడుతుంటే చ‌ర‌ణ్‌కు రీఎంట్రీ అనాలేమో. అయితే మ‌హేశ్‌, బ‌న్నీ మాత్రం బాలీవుడ్ ఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు.

రీసెంట్ టైమ్స్‌లో బ‌న్నీ బాలీవుడ్ ఎంట్రీపై వార్త‌లు వినిపించాయి. దీనిపై రీసెంట్ ఇంట‌ర్వ్యూలో బ‌న్నీ స్పందిస్తూ '' ఈ ఏడాది 'అల వైకుంఠ‌పుర‌ములో'తో స‌క్సెస్ అందుకున్నాను. త‌ర్వాత సుకుమార్ సినిమా చేస్తున్నాను. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్ర‌య‌త్నం చేయాలి. నేను తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 16 ఏళ్లు అయ్యింది. కానీ.. బాలీవుడ్‌లోకి డెబ్యూ అన‌గానే నాకు కొత్త పరిశ్ర‌మే అవుతుంది. రాజ్‌కుమార్ హీరాణి, సుజిత్ సిర్కార్‌, ఆనంద్ ఎల్‌.రాయ్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలీ వంటి ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాను''అని తెలిపారు అల్లు అర్జున్‌.

More News

ర‌వితేజ‌కి బాలీవుడ్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను ప్లాప్‌లు పెద్ద‌గా బాధించ‌వు..క‌థ‌ను, డైరెక్ట‌ర్‌ను న‌మ్మి సినిమాలు చేయ‌డ‌మే నాకు తెలుసు అని ప‌లు సంద‌ర్భాల్లో ర‌వితేజ చెప్పుకొచ్చాడు.

చైనా అమ్మాయితో ఇండియన్ పెళ్లి.. టెస్ట్‌లు చేయగా..!

చైనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నవి ఈ రెండే పేర్లు. ఎక్కడ చూసినా కరోనా భయం..

టీడీపీలో కాదు.. బీజేపీలోనే ఉన్నా..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో.. పలువురు టీడీపీ ఎంపీలు ‘సైకిల్’ దిగి.. కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్: పందులను ప్రాణంతోనే పాతేస్తున్నారు!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనా వాళ్లంటే ప్రపంచమంతా హడలిపోయే పరిస్థితి నెలకొంది.

డిసెంబ‌ర్ 11న అజయ్ దేవగన్ 'మైదాన్' 

భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఫుట్ బాల్ కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.