ఎన్టీఆర్, చ‌ర‌ణ్ బాట‌లో బ‌న్నీ

  • IndiaGlitz, [Friday,November 01 2019]

సుకుమార్ సినిమాలంటే హీరోలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటారు. ఆయ‌న సినిమా స్టైలిష్‌గా ఉన్నా, మాసీగా ఉన్నా హీరోకు గ‌డ్డం ఉండ‌టం కామ‌న్‌గా ఉంటుంది. ఎన్టీఆర్‌తో సుకుమార్ డైరెక్ట్ చేసిన నాన్నకు ప్రేమ‌తో, రామ్‌చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కించిన 'రంగ‌స్థ‌లం'లో హీరోలల‌కు గ‌డ్డం కామ‌న్‌గా పెట్టాడు. ఈ సినిమాలో బ‌న్నీలో స‌రికొత్త లుక్‌లో చూపించ‌బోతున్నారు. అల్లు అర్జున్ 20వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనుంది. చిత్తూరుజిల్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో సాగే క‌థ కాబ‌ట్టి సుకుమార్ హీరో బ‌న్నీని చిత్తూరు యాస‌ను నేర్చుకోమ‌ని కోరారు. డైరెక్ట‌ర్ సూచ‌న మేర‌కు బ‌న్నీ చిత్తూరు జిల్లా యాస‌ను నేర్చుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా అలాగే లుక్ విష‌యంలోనూ బ‌న్నీ చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అల‌..వైకుంఠ‌పుర‌ములో..' సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకోనుంది. సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఇప్పటికే త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన రెండు సాంగ్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

'యాక్షన్‌' ట్రైలర్‌ చాలా చాలా బాగుంది.. డెఫినెట్‌గా సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది - పూరి జగన్నాథ్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌'.

స్నేహితుడి కోసం వంటవాడిగా మారిన మోహ‌న్‌లాల్

మ‌లయాళ అగ్ర క‌థానాయ‌కుడు మోహ‌న్‌లాల్ స్నేహితుడు పృథ్వీరాజ్ కోసం వంట‌వాడిగా మారారు.

సుమంత్ హీరోగా కొత్త చిత్రం

వైవిధ్య‌మైన క‌థాశాలంతో సినిమాలు హీరోగా త‌న‌కంటూ ఓ హీరోగా ఇమేజ్‌ను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు సుమంత్‌.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'అప్పుడు-ఇప్పుడు' పాట విడుద‌ల‌

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో

'తొంగి తొంగి చూడమాకు చందమామ' టీజర్ లాంఛ్

దిలీప్, శ్రావణి జంటగా నటిస్తున్న సినిమా తొంగి తొంగి చూడమాకు చందమామ.