close
Choose your channels

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ బాట‌లో బ‌న్నీ

Friday, November 1, 2019 • తెలుగు Comments

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ బాట‌లో బ‌న్నీ

సుకుమార్ సినిమాలంటే హీరోలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటారు. ఆయ‌న సినిమా స్టైలిష్‌గా ఉన్నా, మాసీగా ఉన్నా హీరోకు గ‌డ్డం ఉండ‌టం కామ‌న్‌గా ఉంటుంది. ఎన్టీఆర్‌తో సుకుమార్ డైరెక్ట్ చేసిన నాన్నకు ప్రేమ‌తో, రామ్‌చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కించిన `రంగ‌స్థ‌లం`లో హీరోలల‌కు గ‌డ్డం కామ‌న్‌గా పెట్టాడు. ఈ సినిమాలో బ‌న్నీలో స‌రికొత్త లుక్‌లో చూపించ‌బోతున్నారు. అల్లు అర్జున్ 20వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనుంది. చిత్తూరుజిల్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో సాగే క‌థ కాబ‌ట్టి సుకుమార్ హీరో బ‌న్నీని చిత్తూరు యాస‌ను నేర్చుకోమ‌ని కోరారు. డైరెక్ట‌ర్ సూచ‌న మేర‌కు బ‌న్నీ చిత్తూరు జిల్లా యాస‌ను నేర్చుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా అలాగే లుక్ విష‌యంలోనూ బ‌న్నీ చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న `అల‌..వైకుంఠ‌పుర‌ములో..` సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకోనుంది. సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఇప్పటికే త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన రెండు సాంగ్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz