బంధుప్రీతిపై బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Monday,January 13 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన 'అల‌..వైకుంఠ‌పుర‌ములో' సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం థ్యాంక్స్ మీట్‌లో బ‌న్నీ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌న‌ల‌నంగా మారాయి.

ప్ర‌స్తుతం బాలీవుడ్, టాలీవుడ్ స‌హా అన్నీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లు బంధుప్రీతితో నిండిపోయింద‌ని అంద‌రూ వార‌సులే సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టాలెంట్ లేక‌పోయినా స్టార్స్ వార‌సుల‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయంటూ కొంద‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విష‌యంపై నాగార్జున‌, రానా వంటి హీరోలు కూడా బ‌హిరంగంగానే త‌మ‌దైన శైలిలో స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ఇప్పుడు వీరి బాట‌లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అడుగు పెట్టాడు. తాజాగా బ‌న్నీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఒకే ఫ్యామిలీ నుండి న‌లుగురైదుగురు హీరోలు వ‌స్తున్నారు. దానికి నెపోటిజం అనే నెగిటివ్ పేరుంది అని సోదాహ‌ర‌ణంగా వివ‌రిస్తూ బ‌న్నీ మాట్లాడారు. ''ఒక పూజారి త‌న మొత్తం జీవితాన్ని దేవుడికే అంకితం చేశాడు. త‌ర్వాత అదే ప‌నిని వాళ్ల కొడుకు చేశాడు. అలాగే వాళ్ల మ‌న‌వ‌డు చేశాడు. అదే త‌ర‌హాలో మేం కూడా మా జీవితాల‌ను ప్రేక్ష‌క దేవ‌ళ్ల‌కు అంకితం చేస్తున్నాం. మా తాత‌, త‌ర్వాత మా నాన్న‌, ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను. ఇదే నెపోటిజం అనుకుంటే ప‌రావాలేదు. మేం ఉన్నంత కాలం ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంటాం'' అని బ‌న్నీ వ్యాఖ్యానించాడు.

More News

కల్యాణ్ రామ్ చెప్పడంతో మూవీ టైటిల్ మార్చిన డైరెక్టర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!?

ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆ చానెల్‌కు చైర్మన్‌గా ఉన్న థర్టీ ఇయర్స్ పృథ్వీ సరస సంభాషణ జరపడంతో ఆ వ్యవహారం చివరికి రాజీనామా దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

మీరెందుకు అలాంటి సినిమాలు చేయ‌రు అని అడిగారు: కల్యాణ్ రామ్

`అత‌నొక్క‌డే` నుండి `118` వ‌ర‌కు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ల్యాణ్‌రామ్‌.

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా  'ఈ కథలో పాత్రలు కల్పితం'

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ  మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో

చరణ్ కోసం కియారా.. దర్శకుడు గట్టి ప్రయత్నాలు!!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే