close
Choose your channels

బంధుప్రీతిపై బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Monday, January 13, 2020 • తెలుగు Comments

బంధుప్రీతిపై బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన `అల‌..వైకుంఠ‌పుర‌ములో` సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం థ్యాంక్స్ మీట్‌లో బ‌న్నీ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌న‌ల‌నంగా మారాయి.

ప్ర‌స్తుతం బాలీవుడ్, టాలీవుడ్ స‌హా అన్నీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లు బంధుప్రీతితో నిండిపోయింద‌ని అంద‌రూ వార‌సులే సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టాలెంట్ లేక‌పోయినా స్టార్స్ వార‌సుల‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయంటూ కొంద‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విష‌యంపై నాగార్జున‌, రానా వంటి హీరోలు కూడా బ‌హిరంగంగానే త‌మ‌దైన శైలిలో స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ఇప్పుడు వీరి బాట‌లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అడుగు పెట్టాడు. తాజాగా బ‌న్నీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఒకే ఫ్యామిలీ నుండి న‌లుగురైదుగురు హీరోలు వ‌స్తున్నారు. దానికి నెపోటిజం అనే నెగిటివ్ పేరుంది అని సోదాహ‌ర‌ణంగా వివ‌రిస్తూ బ‌న్నీ మాట్లాడారు. ``ఒక పూజారి త‌న మొత్తం జీవితాన్ని దేవుడికే అంకితం చేశాడు. త‌ర్వాత అదే ప‌నిని వాళ్ల కొడుకు చేశాడు. అలాగే వాళ్ల మ‌న‌వ‌డు చేశాడు. అదే త‌ర‌హాలో మేం కూడా మా జీవితాల‌ను ప్రేక్ష‌క దేవ‌ళ్ల‌కు అంకితం చేస్తున్నాం. మా తాత‌, త‌ర్వాత మా నాన్న‌, ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను. ఇదే నెపోటిజం అనుకుంటే ప‌రావాలేదు. మేం ఉన్నంత కాలం ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంటాం`` అని బ‌న్నీ వ్యాఖ్యానించాడు.

Get Breaking News Alerts From IndiaGlitz