మ‌రికొంత ఆలస్యం కానున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’. కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. 20 శాతం టాకీ పార్టు, మూడు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తిచేసుకుంది. మే 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల తెర‌కెక్కిస్తున్న‌ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.

అయితే.. ఈపాటికే తొలి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉండగా.. అది మరికొంత ఆలస్యం అయ్యేట్టుగా ఉంది. చిత్రీకరణకు కావాల్సిన కొన్ని ఏర్పాట్లు ఇంకా పూర్తికాకపోవడంతో.. వీసా వ్య‌వ‌హారాల్లో జాప్యం జరుగుతోంద‌ని తెలిసింది. ఈలోగా.. రవితేజ కూడా ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని పూర్తిచేసాకే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ రెండో వారంలో రవితేజ, కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ షూటింగ్ నిమిత్తం అమెరికాకు పయనమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

More News

వెంకీ, వ‌రుణ్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

విక్ట‌రీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్క‌నున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రంలో న‌వ‌దీప్‌?

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్‌లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

 ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం -నిర్మాత‌లు

నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ` టి.జి.విశ్వప్రసాద్ సవుర్పణలో

'అభిమన్యుడు' లో 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా'.. పాట విడుదల

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో

అఖిల్‌-వెంకీ అట్లూరి చిత్రం ప్రారంభం

యూత్‌కింగ్‌ అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకం పై తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్‌ హిట్‌ సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.25