ఏడాదికొకటి చేస్తున్న అనూప్

  • IndiaGlitz, [Tuesday,August 29 2017]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హ‌వా చూపిస్తున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో అనూప్ రూబెన్స్ ఒక‌రు. ప్రేమ‌కావాలి, ఇష్క్‌, మ‌నం, టెంప‌ర్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా త‌దిత‌ర చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అనూప్‌.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య అక్కినేని ఫ్యామిలీ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వ‌చ్చిన అనూప్‌.. ఇప్పుడు నంద‌మూరి హీరోల‌తోనూ సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. సంవ‌త్స‌రానికో నంద‌మూరి హీరో సినిమా అనూప్ ఖాతాలో ప‌డుతోంది.

2015లో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన టెంప‌ర్ చిత్రానికి సంగీత‌మందించిన అనూప్‌.. 2016లో క‌ళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఇజం చిత్రానికి స్వ‌రాలు అందించాడు. ఇక ఈ ఏడాదిలో బాల‌కృష్ణ హీరోగా రూపొందిన పైసా వ‌సూల్ చిత్రానికి స్వ‌ర‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. ఈ మూడు చిత్రాల‌కూ పూరీ జ‌గ‌న్నాథే ద‌ర్శ‌కుడు కావ‌డం.

More News

కళ్యాణ్ రామ్ కి కలిసొస్తారా?

అతనొక్కడే, పటాస్ చిత్రాలతో కథానాయకుడుగా తన సత్తా చాటుకున్నాడు నందమూరి వారి కథానాయకుడు కళ్యాణ్ రామ్. కెరీర్ మొత్తంలో కళ్యాణ్ రామ్కి విజయాన్నిచ్చింది ఈ రెండు చిత్రాలే కావడం గమనార్హం.

చరణ్ తో బోయపాటి?

ఒకరేమో మాస్లో మాంచి ఇమేజ్ ఉన్న కథానాయకుడు.. మరొకరేమో ఊర మాస్ సినిమాలను తీయడంలో దిట్ట అయిన దర్శకుడు. వీరిద్దరు ఒకే సినిమా కోసం కలిసి పనిచేస్తే.. నిజంగా అది మాస్ ప్రేక్షకులకు పండగే.

ఆ రోజుతో 'స్పైడర్' షూటింగ్ పూర్తి

మహేష్ బాబు, మురుగదాస్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం స్పైడర్. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రొమానియాలో షూటింగ్ జరుపుకుంటోంది.

తమన్నా విషయంలో రిపీట్ అవుతుందా?

మొదట ఓ హీరోయిన్ని ఎంచుకోవడం.. ఆమెతో కొన్ని రోజులు షూటింగ్ చేయడం.. ఆ తరువాత ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ రావడం.. ఇలాంటివన్ని సినిమా పరిశ్రమలో సర్వసాధారణమే.

వారం గ్యాప్లో సమంత సందడి

గతేడాది 5 సినిమాలతో సందడి చేసిన అగ్ర కథానాయిక సమంత.. ఆమె గత చిత్రం జనతా గ్యారేజ్ విడుదలై సంవత్సరం అయినా మరో సినిమాతో పలకరించనేలేదు. అలాగని సమంత ఖాళీగానైతే లేదు.