close
Choose your channels

ఆ రోజుతో 'స్పైడర్' షూటింగ్ పూర్తి

Tuesday, August 29, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేష్ బాబు, మురుగ‌దాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం స్పైడ‌ర్‌. భారీ అంచ‌నాల‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం రొమానియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అక్క‌డే ఈ సినిమాకి సంబంధించిన చివ‌రి పాటను తెర‌కెక్కిస్తోంది చిత్ర బృందం. ఈ నెల 31తో ఈ పాట చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యినట్లే.

అంటే.. మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ పుట్టిన‌రోజు నాటికి స్పైడ‌ర్ షూటింగ్ పూర్త‌వుతుంద‌న్న‌మాట‌. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ స్వ‌రాలందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న ద‌స‌రా కానుక‌గా స్పైడ‌ర్ రిలీజ్ కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.