మ‌హేశ్ లిస్టులో మ‌రో హీరోయిన్ చేరింది!!

  • IndiaGlitz, [Sunday,June 07 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా 'స‌ర్కారు వారి పాట' అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేసి సినిమాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప‌లు ర‌కాలైన పేర్లు విన‌ప‌డుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో పాటు పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది.

తాజాగా ఈ లిస్టులో మ‌రో బాలీవుడ్ హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఎవ‌రో కాదు... స‌యీ మంజ్రేక‌ర్‌. న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన మ‌హేశ్ మంజ్రేక‌ర్‌(అదుర్స్ ఫేమ్‌) కుమార్తె అయిన స‌యీ మంజ్రేక‌ర్ ద‌బాంగ్ 3తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వ‌రుణ్‌తేజ్ లేటెస్ట్ చిత్రంలో స‌యీనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంతా ఓకే అయితే మ‌హేశ్‌తో కూడా న‌టిస్తుందేమో చూడాలి.

‘స‌ర్కారు వారి పాట‌’ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ని ఇటీవ‌ల‌ మ‌హేశ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల‌ను మోసం చేసిన విల‌న్ నుండి తిరిగి డ‌బ్బులు రాబ‌ట్టే క‌థే ఈ సినిమా అని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

More News

మాస్‌రాజ‌కు నో చెప్పేసిన హీరోయిన్‌?

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు.మోహ‌న‌న్(‘మ‌హ‌ర్షి’ సినిమాటోగ్రాఫ‌ర్‌) కుమార్తె మాళ‌వికా మోహ‌న‌న్ మలయాళ చిత్రంతో హీరోయినన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్‌లో శ్రియ‌... క‌న్‌ఫ‌ర్మ్ చేసిన న‌టి

ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రితో ఆడిపాడిన శ్రియా శ‌రన్ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటుంది. అయితే ఈమ‌ధ్య ఈమె వ‌రుస సినిమాల్లో న‌టిస్తుంది.

రాహుల్ విజ‌య్ హీరోగా SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ నూత‌న చిత్రం

ఈ మాయ పేరేమిటో, సూర్య‌కాంతం చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజ‌య్ హీరోగా SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా

టీటీడీపై హీరో సూర్య తండ్రి సంచలన ఆరోపణలు.. కేసు నమోదు

తమిళ అగ్ర నటుడు సూర్య తండ్రి శివకుమార్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షాకిచ్చింది.

హైదరాబాద్‌లో ‘పది’ పరీక్షలో వాయిదా..

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం..