close
Choose your channels

మ‌హేశ్ లిస్టులో మ‌రో హీరోయిన్ చేరింది!!

Sunday, June 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేశ్ లిస్టులో మ‌రో హీరోయిన్ చేరింది!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేసి సినిమాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప‌లు ర‌కాలైన పేర్లు విన‌ప‌డుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో పాటు పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది.

మ‌హేశ్ లిస్టులో మ‌రో హీరోయిన్ చేరింది!!

తాజాగా ఈ లిస్టులో మ‌రో బాలీవుడ్ హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఎవ‌రో కాదు... స‌యీ మంజ్రేక‌ర్‌. న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన మ‌హేశ్ మంజ్రేక‌ర్‌(అదుర్స్ ఫేమ్‌) కుమార్తె అయిన స‌యీ మంజ్రేక‌ర్ ద‌బాంగ్ 3తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వ‌రుణ్‌తేజ్ లేటెస్ట్ చిత్రంలో స‌యీనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంతా ఓకే అయితే మ‌హేశ్‌తో కూడా న‌టిస్తుందేమో చూడాలి.

‘స‌ర్కారు వారి పాట‌’ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ని ఇటీవ‌ల‌ మ‌హేశ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల‌ను మోసం చేసిన విల‌న్ నుండి తిరిగి డ‌బ్బులు రాబ‌ట్టే క‌థే ఈ సినిమా అని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.