మ‌రో హిస్టారిక్ మూవీ ఘాజీ ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Saturday,June 27 2020]

సంక‌ల్ప్ రెడ్డి.. 'ఘాజీ', 'అంత‌రిక్షం' సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు. ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఓ భారీ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈసారి సంకల్ప్ త‌న సినిమాను హిందీలో తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాలో హీరో ఎవ‌రో తెలుసా? విద్యుజ‌మాల్‌. క‌త్తి, శ‌క్తి, సికింద‌ర్ వంటి చిత్రాల్లో న‌టించాడు. ఇప్పుడు సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాలో కమాండ‌ర్2 త‌ర్వాత న‌టిస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో నిజఘటనల ఆధారంగా సినిమా తెర‌కెక్క‌నుంది. సాధార‌ణంగా తొలి రెండు సినిమాల‌ను సెట్స్‌లో తీసిన సంక‌ల్ప్ మూడో చిత్రాన్ని జ‌మ్మూకాశ్మీర్‌, ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల్లోని రియ‌ల్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌బోతున్నాడు.

షార్ట్ ఫిలిం చేయాల‌నుకున్న ఓ వ్య‌క్తి. రానా ద‌గ్గుబాటికి, నిర్మాత పివిపికి క‌థ న‌చ్చ‌డంతో ద‌శ తిరిగింది. ద‌ర్శ‌కుడిగా మారాడు. తొలి సినిమాను అండ‌ర్ వాట‌ర్‌లో ఉండే స‌బ్‌మెరైన్ మీద 'ఘాజీ' పేరుతో తెర‌కెక్కించాడు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత అంత‌రిక్ష్య నేప‌థ్యంలో తెర‌కెక్కిన అంత‌రిక్ష్యం 9000 కెఎంపిహెచ్ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడిని ఎవ‌రూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని సంక‌ల్ప్ యాక్ష‌న్ మూవీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌.

More News

టీవీ పరిశ్రమలోని ఆ 33 మంది కరోనా ఫలితం వచ్చేసింది..

లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే షూటింగ్‌లకు సిద్ధమైన టీవీ పరిశ్రమకు నటుడు ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో షాక్ తగిలనట్టైంది.

ఢిల్లీ - గురుగ్రామ్ సరిహద్దుల్లో మిడతల దండు..

ఓ పక్క కరోనా దేశాన్ని కుదిపేస్తుంటే.. మరోపక్క మిడతల దండు భయాందోళనకు గురి చేస్తోంది.

కీలక నిర్ణయం తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ మరణించి 13 రోజులైన సందర్భంగా ‘గుడ్‌బై సుశాంత్’ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది

దాసరి ఆస్తి వివాదంలో చిరంజీవి.. వివరణ ఇచ్చిన అరుణ్

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుల మధ్య ఆస్తి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్న విషయం తెలిసిందే.

నాలుగు సౌతిండియ‌న్ లాంగ్వేజెస్‌లో ఒకేసారి విడుద‌లైన యాక్ష‌న్ హీరో విశాల్ 'చ‌క్ర' ట్రైల‌ర్‌

తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`