రవిప్రకాష్‌ను జైల్‌కు పంపేందుకు మరో సీక్రెట్ ఎఫ్ఐఆర్!?

  • IndiaGlitz, [Friday,July 12 2019]

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఇప్పటికే పలు కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. వీటిలోని ఏ కేసూ రుజువు కాకపోవడం.. మరోవైపు రవిప్రకాష్‌ను విచారణ అంటూ పలు పోలీస్ స్టేషన్ల‌కు వెళ్తున్నారు. ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది.. ఎప్పుడు..? ఎక్కడ..? ఫుల్‌స్టాప్ పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే రవిప్రకాష్‌‌ను ఎలాగైనా సరే జైల్లో పెట్టించడమే టార్గెట్‌గా పెట్టుకున్న మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి తాజాగా మరో తప్పుడు కేసు బనాయించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ కేసు కూడా చాలా సీక్రెట్‌గా ఎఫ్ఐఆర్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకున్న మూడు కేసులు ఎటూ తేలకపోవడంతో ఈ కుట్రకు తెరలేపారని సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న రవిప్రకాష్ అనుచరులు, పలువురు సన్నిహితులు ఆరా తీయగా నిజమని తేలిందట. ఈ పక్కా సమాచారాన్ని ఓ కమిషనర్ స్థాయి ఉన్నతాధికారి నుంచి రవిప్రకాష్ సన్నిహితులు తెలుసుకున్నారని తెలుస్తోంది. దీంతో నిజంగానే రవిప్రకాష్‌పై ఈ అక్రమ కేసు బనాయించి ఇబ్బంది పెడితే పరిణామాలు వేరేగా ఉంటాయని తేల్చిచెబుతున్నారు. రవిప్రకాశ్‌‌ను ఎటువంటి వేధింపులకు గురిచేసినా జర్నలిస్టులు రోడ్డు మీదికొచ్చి ధర్నాలు చేస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. తెలంగాణా పోరాటాలు చేసిందని.. మా గొంతులేనని ఇప్పుడు అదే గొంతును నులిమేయించుకోవడానికి సరికాదని చెబుతున్నారు. తెలంగాణ సమాజంలో తమకు పోరాటాలేమీ కొత్త కాదని.. పోరాటానికి వెనకాడే ప్రసక్తే లేదని జర్నలిస్టులు తేల్చిచెబుతున్నారు.

అయితే ఈ సీక్రెట్ కేసు ఎంత వరకు నిజం..? ఎవరైనా కావాల్సిందే ఇలా పుకార్లు పుట్టిస్తున్నారా..? లేకుంటే ఈ వ్యవహారం ఏదైనా జరుగుతోందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

ఏపీ బడ్జెట్ లెక్కలివీ.. అమరావతికి ఎంత కేటాయించారంటే..!

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు.

వైఎస్ జగన్ రాజకీయ వారసుడెవరో తెలిసిపోయిందిగా..!?

2019 ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది నోట వినిపించిన మాట వైఎస్ జగన్ వారసుడెవరు..?

కేసీఆర్‌కు కోలుకోలేని షాక్.. బీజేపీలోకి ఎంపీ!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాషాయం జెండాను పాతాలని కమలనాథులు భావిస్తున్నారు.

మేకప్ లేకుండా సమీరారెడ్డి.. వావ్ అనిపిస్తున్న ఒరిజనల్ లుక్‌!

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన తారలంతా అలా తళుక్కుమని.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.

‘దొరసాని’ స్క్రిప్ట్‌కు మూడేళ్లు పట్టింది.. ఆ హీరోలిద్దరూ రెడీగా ఉన్నారు!

శివాత్మిక రాజ‌శేఖ‌ర్-ఆనంద్ దేవ‌ర‌కొండ‌ను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ కేవీఆర్ మ‌హేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘దొరసాని’.