close
Choose your channels

‘దొరసాని’ స్క్రిప్ట్‌కు మూడేళ్లు పట్టింది.. ఆ హీరోలిద్దరూ రెడీగా ఉన్నారు!

Friday, July 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘దొరసాని’ స్క్రిప్ట్‌కు మూడేళ్లు పట్టింది.. ఆ హీరోలిద్దరూ రెడీగా ఉన్నారు!

శివాత్మిక రాజ‌శేఖ‌ర్-ఆనంద్ దేవ‌ర‌కొండ‌ను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ కేవీఆర్ మ‌హేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రం ఈ నెల 12న అభిమానుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మొదలుకుని ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ చేస్తూ అటు డైరెక్టర్.. ఇటు నిర్మాతలు.. నటీనటులు బిజిబిజీగా గడుపుతున్నారు. తాజాగా.. ఈ మూవీ సినిమా గురించి డైరెక్టర్ మ‌హేంద్ర మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్మూలో భాగంగా తన బ్యాగ్రౌండ్ ఏంటి..? ఎక్కడ్నుంచి వచ్చారు..? అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు..? దొరసాని అనే కథ ఎలా పుట్టుకొచ్చింది..? ఈ కథకు శివాత్మిక, ఆనంద్ దేవరకొండలనే ఎందుకు ఎంచుకున్నారు..? అనే ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

‘నిశీధి’ తర్వాత నాలైఫ్‌లో చాలా మార్పులొచ్చాయ్!

"మాది వరంగల్ జిల్లాలోని జయగిరి అనే ఊరు. 17 ఏళ్లుగా సినిమా ఇండ‌స్ట్రీలోనే ఉన్నాను. అందరి లాగే నేను కూడా సినిమా క‌ష్టాల‌న్నీ ప‌డ్డాను. 2014లో తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు ఒక రోజు నా ఫ్రెండ్ కారులో ట్యాంక్‌బండ్ మీద వెళ్తున్నాను. అప్పుడు అంద‌రూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇంత మంది ఇంత ఆనందంగా ఉండ‌టానికి కార‌ణం అమ‌ర‌వీరులే క‌దా అని అనిపించింది. ప్రపంచ‌వ్యాప్తంగా ఇలాంటి చాలా పోరాటాలు జ‌రిగి ఉంటాయి. వాటి వెనుక ఎంద‌రో ప్రాణ త్యాగం చేసి ఉంటారు. అలాంటి నేప‌థ్యంతో నేను ‘నిశీథి’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. దాదాపు 18 దేశాల్లో 39 జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డుల‌ను గెలుచుకుంది ఆ షార్ట్ ఫిల్మ్. బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఇది చేస్తున్నప్పుడే నాకు వెంక‌ట్ సిద్ధారెడ్డి.. త‌రుణ్ భాస్కర్ వంటి వారంద‌రూ ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ షార్ట్ ఫిల్మ్ వ‌ల్ల నేనేం రాయ‌గ‌ల‌ను. నా బ‌లాలేంటో తెలిసింది. శ్యామ్‌బెన‌గ‌ల్‌ లాంటి వారు న‌న్ను అప్రిషియేట్ చేస్తూ మెయిల్స్ చేశారు.

దొరసాని కథ ఎలా పుట్టింది!?

ప్రముఖులంతా నన్ను మెచ్చుకున్న తర్వాత ‘దొర‌సాని’ క‌థ రాశాను. దాదాపు 42 వెర్షన్లు రాశాను. వెంక‌ట్ సిద్ధారెడ్డి ద్వారా సురేష్‌బాబుగారిని క‌లిసి క‌థ చెప్పా. ఆయ‌న‌కు చెప్పింది 32వ వెర్షన్‌. ఆ త‌ర్వాత 42వ వెర్షన్ చేసుకుంటున్నప్పుడు నాకు ఫుల్‌ఫిల్‌గా అనిపించింది. మూడు సంవత్సరాలు దొర‌సాని స్క్రిప్ట్ రాశాను అన్నారు. దొరసాని సెటప్ అండ్ స్టోరీ వరల్డ్ చాలా కొత్తగా ఉంటుంది. రెండు గంటల పదిహేను నిముషాలు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లి కొత్త అనుభూతిని ఎక్స్ పీరియన్స్ చేస్తాం. ముఖ్యంగా దొర వ్యవస్థ ఆ రోజుల్లో పరిస్థితులను అప్పటి వరల్డ్ కు ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీను యాడ్ చేసి.. ఈ సినిమా చేయడం జరిగింది.

నటీనటుల గురించి..!

రాజు రియ‌లిస్టిక్ పాత్రలో ఆనంద్ కనిపిస్తాడు. రాజు సన్నివేశాలు కూడా చాలా స‌హజంగా అనిపిస్తాయి. తన పాత్రతో పాటు మిగిలిన పాత్రలు కూడా రియ‌ల్ లైఫ్‌కి చాల దగ్గరిగా ఉంటాయి. ప్రేక్షకులు సినిమాకు బాగా క‌నెక్ట్ అవుతార‌నే నమ్మకం ఉంది. నేను దొరసాని ఎలా ఉండాలి అని ఊహించానో.. శివాత్మిక సేమ్ టూ సేమ్ అలాగే దిగిపోయారు. నా పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. నిజంగా ఆమె అద్భుతంగా నటించింది. దొరసాని పాత్రకు తగట్లే ఆమె నటన చాల సహజంగా అనిపిస్తోంది.

ఆ ఇద్దరూ కథ చెప్పమన్నారు!

భవిష్యత్తులో నేను ఎవరితో సినిమాలు చేస్తానో చెప్పలేను. ఎవరితో సినిమా తీయాలో నేను ఏమీ ఏమీ అనుకోలేదు. నా ద‌గ్గర చాలా ఐడియాలున్నాయి. యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌.. నీ తరువాత సినిమా నాతోనే చెయ్యాలి అని ఇప్పటికే చాలాసార్లు నవ్వుతూ అడిగారు. అలాగే విజయ్ దేవరకొండగారు కూడా కథ ఉంటే చెప్పు అని అడిగారు. అంటే ఈ ఇద్దరూ సినిమా కథ చెబితే మహీంద్ర దర్శకత్వంలో నటించేందుకు రెడీగా ఉన్నారన్నమాట.

దొరసాని రిలీజ్ తరువాతే.. నా తరువాటి సినిమా డిసైడ్ అవుతుంది. ఏ ర‌చ‌యిత అయినా, త‌న‌కు జ‌రిగిన‌వో, త‌నకు తెలిసిన వారికి జ‌రిగిన‌వాటినో ఎక్కడో ఒక‌చోట రాస్తారు. నాలోనూ అలాంటివే ఉన్నాయేమో అని కేవీఆర్ మ‌హేంద్ర చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.