ఒడిశాకు ఏపీ సీఎం.. జగన్‌పై అభిమానం చాటుకున్న తెలుగువారు, భువనేశ్వర్‌ నిండా ఫ్లెక్సీలే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఒడిశాలోని తెలుగువారు అభిమానం చాటుకున్నారు. నిన్న భువనేశ్వర్‌ పర్యటనకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఒడిశాలోని తెలుగు సంస్థలైన బరగఢ్‌ అత్తాబిరా కోసలాంధ్ర కల్చరల్‌ అసోషియేషన్‌, భువనేశ్వర్‌ ఆంధ్ర సాంస్కృతిక సమితి, కటక్‌ ఐక్యత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విమానాశ్రయం నుంచి స్టేట్ గెస్ట్‌హౌస్ వరకు రోడ్డుకు ఇరువైపులా దాదాపు 80 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయనపై అభిమానం చాటుకున్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో జగన్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆయనను కలిసి జ్ఞాపికలు అందజేశారు. జగన్‌ను కలవడం పట్ల రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని కోసలాంధ్ర కల్చరల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు డి.మురళీకృష్ణ మీడియాకు తెలిపారు. అలాగే ఏపీ- ఒడిషా సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు:  సీక్రెట్‌ రూమ్‌కు జెస్సీ.. గేమ్స్, టాస్క్‌లు లేక కబుర్లలో మునిగిపోయిన హౌస్‌మేట్స్

బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషన్స్‌తో సాగింది.

'పుష్పక విమానం' లో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా - హీరోయిన్ శాన్వి మేఘన

"బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్", "పిట్ట కథలు", "సైరా నరసింహారెడ్డి", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" చిత్రాలతో తెలుగ్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన.

ప్రభుదేవా, రెజీనాలతో అనసూయ 'ఫ్లాష్ బ్యాక్'.. డబ్బింగ్ పనులు ప్రారంభం

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ 'ఫ్లాష్ బ్యాక్'.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కి స్పెషల్ పవర్స్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

బిగ్‌ బాస్‌ తెలుగు 5 విజయవంతంగా తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. ఈ రోజుతో పదో వారంలోకి అడుగుపెట్టాం.

బంగార్రాజు : ఆకట్టుకుంటున్న “లడ్డుందా” లిరికల్ సాంగ్... నాగ్ గాత్రంతో మాస్‌కు పూనకాలే

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’ సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే.