చంద్రబాబూ.. నేనేం మీ ‘పప్పు’లాంటోడ్ని కాదు!

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు వాడివేడిగా జరిగాయి. అటు అసెంబ్లీలో.. ఇటు శాసనమండలిలో వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలుగా పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే రోజా వాయిస్‌లే ఎక్కువగా వినిపించాయి. ఈ ముగ్గురు కూడా టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌ల గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే మంత్రి అనిల్ మాత్రం మరింత డోస్ పెంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ గురించి ఏం మాట్లాడారు..!?

మొదట మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నిన్న గా మొన్నొచ్చి మంత్రి అయ్యారు.. అప్పుడే మా అధినేత చంద్రబాబుకు ఇరిగేషన్ పాఠాలు చెప్పేంత అయ్యావా..? అని అనగా.. మంత్రి అనిల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న గాక మొన్న వచ్చినా సొంత నియోజకవర్గం అయిన మంగళగిరిని కూడా మందలగిరి అని పేరు కూడా సరిగా పిలవలేని పప్పుని కాదు. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తిని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. అధ్యక్షా! ఆయన కొడుకు మాదిరి కనీసం నియోజకవర్గాన్ని పేరు పెట్టి పిలవలేక,మంగళగిరిని మందలగిరిగా పిలిచే పప్పు ని మాత్రం నేను కాదు అని అసెంబ్లీలో లేని లోకేష్ ప్రస్తావన తెచ్చారు మంత్రి.

మేమేంటో చూపిస్తాం!

నేను ఈ పదవికి కొత్తే కావచ్చు, కానీ తొందరగానే నేర్చుకుంటాము. నలభై సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారికి ఉండవచ్చు, అంత మాత్రాన ఆయన తప్పులు చేస్తూ,దోచుకోని తింటూ ఉంటే సైలెంట్‌గా ఉండలేము. ఆయన చేసిన తప్పులను మేము చెపుతుంటే, ఆలా చెప్పకూడదు.. యంగ్ స్టార్స్ రాకూడదు అంటే కుదరదు.. మేమేంటో చూపిస్తాం మా పవర్ ఏమిటో చూపిస్తాం. 45 రోజుల్లో అన్ని బయటకు తీస్తాం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. అయితే అనిల్ కౌంటర్‌కు తర్వాత అచ్చెన్న రియాక్ట్ కాలేదు. ఈ వ్యవహారంపై లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

'RRR'కు నైజాంలో భారీ రేటు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం `RRR`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా..

ఏపీ అసెంబ్లీలో ‘బోయపాటి’ ప్రస్తావన.. రోజా ఎందుకు మాట్లాడినట్లు!?

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు పారేసుకుంటున్నారు.

‘అన్న’ అలా.. ‘తమ్ముడు’ ఇలా.. కోమటి బ్రదర్స్ దారెటు!

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ గత కొన్నిరోజులు పెద్ద ఎత్తున వార్తలు రావడంతో పాటు.. ఇటీవల రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై దాదాపు కన్ఫామ్ చేసేసిన సంగతి తెలిసిందే.

తూచ్.. అవన్నీ పుకార్లే అంటున్న సుహాసిని!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్టు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు హడావుడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను ఆయనకు

వైఎస్ జగన్ గిఫ్ట్‌ను కాదనలేకపోయిన కేటీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ వెంట తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు.