జబర్దస్త్ వినోదినిపై దాడి.. అసలేం జరిగింది!

  • IndiaGlitz, [Saturday,July 20 2019]

తెరపై వినోదంతో నవ్వులు పంచే నటీనటుల వ్యక్తి గత జీవితంలో మాత్రం రెగ్యులర్ కష్టాలు తప్పటం లేదు. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్‌షో ద్వారా సుపరిచితుడైన నటుడు వినోద్ అలియాస్ వినోదిని హత్యాయత్నం జరిగింది. వినోద్ ఉంటున్న ఇంటి ఓనర్.. శనివారం నాడు దాడి చేశాడు. ఈ ఘటనలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న మిత్రులు హుటాహుటిన అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా.. తనపై దాడిచేసిన ఇంటి ఓనర్‌పై వినోద్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇంటి ఓనర్‌ను స్టేషన్‌ను రప్పించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా.. వినోద్ నగరంలోని కుద్బిగూడలో నివాసముంటున్నాడు.

అయితే.. ఓనర్‌- వినోద్‌ల మధ్య అసలేం జరిగింది..? ఈ గొడవ ఎందుకు జరిగింది..? ఓనర్ ఎందుకు చేయిచేసుకున్నారు..? దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఏ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది..? అసలు ఈ గొడవకు కారకులెవరు..? అనే కోణంలో పోలీసులు ఓనర్‌ను విచారిస్తున్నారు. అయితే ఈ విషయంపై అటు పోలీసులు గానీ ఇటు వినోదిని కానీ ఇంత వరకూ మీడియాతో మాట్లాడలేదు.

More News

జూలై 26 న  సైకలాజికల్ థ్రిల్లర్ 'నేను లేను' విడుదల

థ్రిల్లర్ ... ఈ జోనర్ అంటే ఇష్టపడని వారుండరు. ఇప్పటివరకు మంచి కంటెంట్ తో వచ్చిన థ్రిల్లర్ మూవీస్ అన్ని విజయం సాధించడమే దీనికి ఉదాహరణ..

బిగ్‌బాస్ షో హోస్ట్‌గా నాగార్జున తప్పుకుంటారా!?

బిగ్‌బాస్ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున తప్పుకుంటారా..? వరుస వివాదాల నేపథ్యంలో నాగ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..?

నాగార్జున ఇంటికి ముట్టడించిన ఓయూ విద్యార్థులు

బిగ్‌బాస్ షోపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ షోను ఆపేయాలంటూ ఇప్పటికే పోలీసు స్టేషన్లు, కోర్టు మెట్లెక్కిన విషయం విదితమే.

ర‌వితేజ స్కెచ్‌.. సిద్ధార్థ హెల్పూ..

ర‌వితేజ వేసే స్కెచ్‌కు సిద్ధార్థ హెల్ప్ చేస్తాన‌ని మాటిచ్చారు. అయితే అది రియ‌ల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో.

మ‌హేష్ థంబ్స‌ప్

ఇంత‌కు ముందు చిత్రాల‌తో పోలిస్తే ఇప్పుడు మ‌హేష్ త‌న అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు.