close
Choose your channels

బిగ్‌బాస్ షో హోస్ట్‌గా నాగార్జున తప్పుకుంటారా!?

Saturday, July 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ షో హోస్ట్‌గా నాగార్జున తప్పుకుంటారా!?

బిగ్‌బాస్ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున తప్పుకుంటారా..? వరుస వివాదాల నేపథ్యంలో నాగ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఈ వివాదాలన్నింటికి దూరంగా ఉండాలని కింగ్ నిర్ణయించారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. అసలు నాగ్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? అసలు ఇంత సడన్‌గా ఎందుకిలా చేస్తున్నారు..? అనే విషయం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది!

బి‌గ్‌బాస్ సీజన్-3 ప్రారంభం అవుతుందనే వార్తలు మొదలుకుని నేటి వరకూ షోపై వరుస వివాదాలే నెలకొన్నాయి. అయితే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవరిస్తున్నారన్నప్పట్నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. ఓ వైపు నిర్వాహకులు తప్పులు.. మరోవైపు కో ఆర్డినేటర్స్ తమను వేధిస్తున్నారని గాయత్రీ గుప్తా, శ్వేతారెడ్డి కోర్టులో పిల్ దాఖలు చేశారు. మరోవైపు ఈ షోలోని ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ ఒకఎత్తయితే ఉస్మానియా విద్యార్థులు రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.

నాగ్ ఇంటి ముందు ఆందోళన!

ఇప్పటికే ఈ షోను ఆపేయాలని ఉస్మానియా విద్యార్థులు హెచ్చరించారు. అంతేకాదు నాగ్ హోస్ట్‌గా చేస్తే ఊరుకునేది లేదని శనివారం నాడు ఆయన ఇంటి ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతటితో విద్యార్థులు షో ఆపేయాల్సిందేనని.. నాగ్ వెళితే మాత్రం ఆయన స్టూడియోల ముందుకు నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థులు, విద్యార్థుల సంఘాల అన్నంత పని చేస్తాయన్న విషయం పలుమార్లు రుజువైన విషయం విదితమే.

నాగ్ తప్పుకుంటారా!?

ఈ నేపథ్యంలో లేనిపోని తలనొప్పులు మనకు అవసరమా..? అని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారట. దీంతో నాగ్ కూడా బిగ్‌బాస్ షో నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ‘మా’ యాజమాన్యం.. హుటాహుటిన నాగ్ ఇంటికెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంట నుంచి ఈ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే నాగార్జున వారి బుజ్జగింపులకు లొంగుతారా..? లేకుంటే తప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రేపు ప్రారంభం కానున్న షో.. వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.