close
Choose your channels

జబర్దస్త్ వినోదినిపై దాడి.. అసలేం జరిగింది!

Saturday, July 20, 2019 • తెలుగు Comments

జబర్దస్త్ వినోదినిపై దాడి.. అసలేం జరిగింది!

తెరపై వినోదంతో నవ్వులు పంచే నటీనటుల వ్యక్తి గత జీవితంలో మాత్రం రెగ్యులర్ కష్టాలు తప్పటం లేదు. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్‌షో ద్వారా సుపరిచితుడైన నటుడు వినోద్ అలియాస్ వినోదిని హత్యాయత్నం జరిగింది. వినోద్ ఉంటున్న ఇంటి ఓనర్.. శనివారం నాడు దాడి చేశాడు. ఈ ఘటనలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న మిత్రులు హుటాహుటిన అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా.. తనపై దాడిచేసిన ఇంటి ఓనర్‌పై వినోద్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇంటి ఓనర్‌ను స్టేషన్‌ను రప్పించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా.. వినోద్ నగరంలోని కుద్బిగూడలో నివాసముంటున్నాడు.

అయితే.. ఓనర్‌- వినోద్‌ల మధ్య అసలేం జరిగింది..? ఈ గొడవ ఎందుకు జరిగింది..? ఓనర్ ఎందుకు చేయిచేసుకున్నారు..? దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఏ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది..? అసలు ఈ గొడవకు కారకులెవరు..? అనే కోణంలో పోలీసులు ఓనర్‌ను విచారిస్తున్నారు. అయితే ఈ విషయంపై అటు పోలీసులు గానీ ఇటు వినోదిని కానీ ఇంత వరకూ మీడియాతో మాట్లాడలేదు.

Get Breaking News Alerts From IndiaGlitz