close
Choose your channels

కావాలని చేస్తున్నారు.. నన్ను ఆడుకుంటున్నారు: అవినాష్ ఫైర్

Saturday, October 24, 2020 • తెలుగు Comments

కావాలని చేస్తున్నారు.. నన్ను ఆడుకుంటున్నారు: అవినాష్ ఫైర్

ఇవాళ బిగ్‌బాస్ హౌస్‌లో సినిమా షూటింగ్. చాలా ఫన్నీ ఫన్నీగా నడిచింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. అఖిల్, మోనాల్ హీరోహీరోయిన్ అయితే అఖిల్ డైరెక్టర్. ‘ఓ బావ.. మా అక్కని చక్కగా చూస్తావా..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. సెంచరీ మ్యాట్రెసెస్ టాస్క్‌.. ఈ టాస్క్‌లో విన్ అయిన వారికి సెంచరీ మ్యాట్రెసెస్‌పై నైట్ పడుకునే అవకాశంతో పాటు ఒక గంట ఆలస్యంగా లేచే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించారు. దీంతో సొహైల్.. తనకే అవకాశం ఇవ్వాలని మిగిలిన కంటెస్టెంట్లను అడిగాడు. బజర్ మోగగానే అభి, అమ్మ, నోయెల్ తప్ప మిగిలిన వాళ్లంతా మ్యాట్రెసెస్ పైకి ఎక్కారు. ఈ టాస్క్‌లో దివి విన్ అయింది. తరువాత మరో టాస్క్. ‘బిగ్‌బాస్ బ్లాక్ బస్టర్’. అంతా కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో ఒక సినిమాను తీయాలి. డైరెక్టర్ అభి, స్క్రిప్ట్ రైటర్ అవినాష్, డీఓపీ నోయెల్, ఐటెమ్ సాంగ్ సొహైల్, హారిక, హెయిర్ స్టెయిలిస్ట్ లాస్య. అభి, అఖిల్‌ల మధ్య హీరోయిన్(మోనాల్) గురించి ఫన్నీ కాన్వర్సేషన్ నడవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది.

ఐటెమ్ సాంగ్‌కి అమ్మ రాజశేఖర్ కొరియోగ్రఫీ చేశారు. ఐటెమ్ సాంగ్ ఎక్కడ చేయాలో బిగ్‌బాస్ చెప్పారని చెప్పడంతో అమ్మ సడెన్‌గా ఫైర్ అయ్యారు. దీంతో అభి, అమ్మ మధ్య చిన్న గొడవ. ఉన్నట్టుండి సడెన్‌గా అమ్మ రేజ్ అయ్యారు. నీ బిహేవియర్ ఏంటంటూ ఫైర్ అయ్యారు. అభి కూడా గట్టిగానే మాట్లాడటంతో అక్కడి నుంచి అమ్మ వెళ్లిపోయారు. దివి వెళ్లి అమ్మను కన్విన్స్ చేసింది. సినిమాకు టైటిల్ ఏం పెడతామనే దానిపై డిస్కసన్. సొహైల్ వచ్చి ‘కథ వేరుంటది’ అనే టైటిల్ పెడతామనడం ఫన్నీగా అనిపించింది. బయట ఒక షాట్ తీయడం అయిపోయిందని నేను రమ్మన్నప్పుడు రావాలని అమ్మకు అభి చెప్పాడు. ఆ తరువాత సారీ కూడా చెప్పాడు. సొహైల్‌ను ఐటమ్ రాజా అంటూ లాస్య బాగా కామెడీ చేసింది. మోనాల్‌కి అభి ఒక్కటే సీన్ ఇచ్చాడు. దీనిపై అమ్మ బాగా ఆట పట్టించారు. ఇక సినిమాకు లాస్య ఇచ్చిన టైటిల్ ‘బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ తోపు.. దమ్ముంటే ఆపు’. ముగ్గురూ కలిసి బాగా కామెడీ చేశారు. ఇక స్క్రిప్ట్ విషయంలో అభి, అవినాష్‌ల మధ్య రచ్చ. తరువాత అవినాష్ వెళ్లి సొహైల్ దగ్గర డిస్కషన్

కావాలని చేస్తున్నారు.. నన్ను ఆడుకుంటున్నారు: అవినాష్ ఫైర్

అఖిల్, మోనాల్‌ల మధ్య రొమాంటిక్ సీన్. దీనికి నేను డైరెక్ట్ చేయడం అల్టిమేట్.. ఏం ఫిట్టింగ్ పెట్టారు బిగ్‌బాస్ అంటూ అభి కామెడీ. ఇక అఖిల్‌ని పాట పాడమంటే.. ఎప్పుడూ పాడే పాటనే అదే.. ‘నిన్న కనిపించావు’ అనే సాంగ్‌ను పాడాడు. ఇన్నిసార్లు పాడినా.. అఖిల్‌కి బోర్ రాలేదేమో కానీ చూసే వాళ్లకు మాత్రం ఆ పాటపైనే విరక్తి పుట్టిద్దేమో. డోర్ తీయండ్రా బయటికెళ్లిపోతానంటూ అమ్మ కామెడీ. మొత్తానికి అంతా కలిసి బాగా కామెడీ చేశారు. ఇక నాకు ఫైట్ సీన్ ఇస్తే ఇలా చేస్తా.. అలా చేస్తానంటూ అవినాష్.. సొహైల్, మెహబూబ్‌ల దగ్గర చెప్పాడు. ఆ తరువాత ఐటెమ్ సాంగ్. సొహైల్, హారిక ఇరగదీశారు. అవినాష్ డైలాగ్ చెప్పబోతుంటే.. లాస్య వచ్చి టచ్ అప్ అంటూ.. దివికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ అభి డిస్టర్బ్ చేశాడు. దీంతో అవినాష్ బాగా హర్ట్ అయ్యాడు. అరియానా.. కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. కావాలని చేస్తున్నారు.. నన్ను ఆడుకుంటున్నారంటూ నోయెల్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. నామినేషన్స్‌లో అన్నీ చూపిస్తానంటూ అవినాష్ ఫైర్ అయ్యాడు. ఇంతలోనే అభి వచ్చి అవినాష్‌ను తీసుకెళ్లాడు. ఈ హౌస్‌లో నేను డైరెక్షన్ చెయ్యనంటూ అభి కామెడీ. తరువాత దివి వెళ్లి సెంచురీ మ్యాట్రెసెస్‌పై పడుకుంది. తన బెడ్‌పై పడుకున్నట్టుందని చెప్పింది. ఇక రేపు ఇవాళ తీసిన సినిమాను బిగ్‌బాస్ ప్లే చేయనున్నట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz