ఈ నెల 15 న 'ఆయుష్మాన్ భవ' కర్టన్ రైజర్ వేడుక!!

  • IndiaGlitz, [Monday,March 13 2017]

మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆయుష్మాన్ భ‌వ‌' చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది. 'సినిమా చూపిస్త మావ‌', 'నేను లోక‌ల్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త్రినాధ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నారు. బాలీవుడ్ లో ప‌లు హిట్ సినిమాల‌కు సంగీతం అందించిన‌ మీట్ బ్ర‌ద‌ర్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'చెన్నై ఎక్స్ ప్రెస్', 'దిల్ వాలే' వంటి హిట్ చిత్రాల‌కు ఛాయాగ్రాహ‌కుడిగా పనిచేసిన డూడ్లీ ఈ సినిమాకు కెమెరా మేన్ గా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభం కానున్న సినిమా గురించి అదే రోజున చిత్ర యూనిట్ మాధాపూర్ ఎన్ క‌న్వెన్ హాల్ లో క‌ర్ట‌న్ రైజ‌ర్ వేడుకను నిర్వ‌హిస్తుంది.

ఈ సంద‌ర్భంగా సి.టి.ఎఫ్ ప్ర‌తినిధి చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ '' త్రినాధ‌రావు న‌క్కిన‌, డూడ్లీ వంటి టాప్ టెక్నిషీయ‌న్ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. అలాగే సీనియ‌ర్ రైట‌ర్స్ ప‌రుచూరి ప్ర‌ద‌ర్స్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే స‌మ‌కూరుస్తున్నారు. ఇంత మంది పెద్ద వాళ్ల‌తో పాటు, మారుతితో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుతున్నా. 15వ తేదిన పూజాకార్య‌క్ర‌మాలు అనంత‌రం అదే రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు టైటిల్ లోగో లాంచ్‌, సాంకేతిక నిపుణుల‌ను ప‌రిచ‌యం చేస్తూ కర్ట‌న్ రైజ‌ర్ వేడుక చేస్తున్నాం. ఇలా సినిమా ప్రారంభం త‌ర్వాత క‌ర్టైన్ రైజ్ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం' అని అన్నారు.

అలాగే ఈ క‌ర్ట‌న్ రైజ‌ర్ వేడుక‌లో మీట్ బ్ర‌ద‌ర్స్ సంగీతంతో అల‌రించ‌నున్నారు. ప్ర‌ముఖ హీరోయిన్ల డ్యాన్సుల‌తో వేదిక మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడ‌నుంది. ఈ వేడుక‌కు ప‌లువురు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు హ‌జ‌రు కానున్నారు.

More News

సప్తగిరి ఎక్స్ ప్రెస్ 50 రోజుల వేడుక

సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి బ్యానర్పై సప్తగిరి,రోషిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ పవార్ దర్శకత్వంలో

'రక్షక భటుడు' సినిమా సూపర్ హిట్ అవుతుంది! - ప్రముఖ నటుడు బ్రహ్మానందం

"ఈ చిత్ర నిర్మాత గురురాజ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు.నాతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు.ఇప్పుడు నిర్మాతగా మారి 'రక్షక భటుడు'

'కాటమరాయుడు' శాటిలైట్ హక్కులు ఎవరివంటే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో కిషోర్ పార్థసాని(డాలీ)దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై

రెండో సినిమా కూడా సప్తగిరితోనేనట...

డాక్టరుగా ఉండి ప్రొడ్యూసర్ గా మారిన డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా చేసిన చిత్రం 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'.

అల్లరి నరేష్ రీమేక్ సినిమాను స్టార్ట్ అయ్యింది.....

యంగ్ జనరేషన్ కామెడి హీరో అల్లరి నరేష్ తన 53వ సినిమా మేడ మీద అబ్బాయి సినిమా స్టార్ట్ అయ్యింది.