close
Choose your channels

అల్లరి నరేష్ రీమేక్ సినిమాను స్టార్ట్ అయ్యింది.....

Monday, March 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ జ‌న‌రేష‌న్ కామెడి హీరో అల్ల‌రి న‌రేష్ త‌న 53వ సినిమా మేడ మీద అబ్బాయి సినిమా స్టార్ట్ అయ్యింది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ఒరు వ‌డ‌క్క‌మ్ సెల్ఫీ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌ల‌యాళంలో సినిమాను డైరెక్ట‌ర్ చేసిన జి.ప్ర‌జిత్ ద‌ర్శ‌క‌త్వంలో బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్ నిర్మాత‌గా ఈ సినిమా రూపొందనుంది. బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్ గ‌తంలో న‌రేష్‌తో కెవ్వు కేక సినిమాను నిర్మించారు. రామానాయుడు స్టూడియో ప్రారంభ‌మైన ఈ సినిమా ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్ట‌గా, నూజివీడు సీడ్స్ వైస్ ప్రెసిడెంట్ రామ‌కోటేశ్వ‌రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి భీమనేని శ్రీనివాస‌రావు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ల‌యాళంలో పెద్ద హిట్ అయిన `ఒరు వ‌డ‌క్కం సెల్ఫీ` చిత్రానికి ఇది రీమేక్‌గా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళం డైరెక్ట్ చేసిన ప్రజిత్ తెలుగులో కూడా డైర‌క్ట్ చేయ‌డం హ్యాపీగా ఉంది. గ‌మ్యం, శంభో శివ శంభో వంటి సినిమాల త‌ర్వాత ఆ రేంజ్‌లో మంచి గ్రిప్పింగ్‌గా సాగే సినిమా ఇది. గ‌తంలో నాతో కెవ్వు కేక సినిమాను నిర్మించిన బొప్పన చంద్ర‌శేఖ‌ర్ ఈ సినిమాను నిర్మించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మసుడిగాడు సినిమాకు హిట్‌మ్యూజిక్ అందించిన డిజె.వ‌సంత్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్‌మూవీ. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ఇది. కామెడి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మార్చి 16 నుండి పొల్లాచ్చిలో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్త‌వుతుందని అల్ల‌రి న‌రేష్ తెలిపారు.
నాకు ఇష్టమైన హీరో అల్ల‌రి న‌రేష్‌. ఆయ‌న్ను ఎలా చూడాల‌నుకుంటున్నానో అలా తెర‌పై చూంచే చిత్ర‌మే `మేడ మీద అబ్బాయి`. మ‌ల‌యాళంలో విడుద‌లై పెద్ద హిట్టైన ఒరువ‌డ‌క్క‌న్ సెల్ఫీకి ఇది రీమేక్ వెర్ష‌న్‌. అని నిర్మాత బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్ చెప్పారు.

అల్ల‌రి న‌రేష్‌, నిఖిలా విమ‌ల్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, జ‌య‌ప్ర‌కాష్‌, తుల‌సి, సుధ‌, స‌త్యం రాజేష్‌, మ‌ధునంద‌న్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ ఆది, ప‌ద్మ జ‌యంతి, ర‌విప్ర‌కాష్‌, వెన్నెల రామారావు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మాట‌లుః చంద్ర‌శేఖ‌ర్‌(పిల్ల జమీందార్‌), కెమెరాః ఉన్ని ఎస్‌.కుమార్‌; స‌ంగీతంః డి.జె.వ‌సంత్‌, ఆర్ట్ః రాజీవ్ నాయర్‌; ఎడిట‌ర్ః నంద‌మూరి హ‌రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాతః బొప్పన చంద్ర‌శేఖ‌ర్‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః జి.ప్ర‌జిత్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.