'బాహుబలి2' ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Sunday,March 19 2017]

రాజ‌మౌళి, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ 'బాహుబ‌లి 2'. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు ఉదాహ‌ర‌ణ‌మే ట్రైల‌ర్‌.

బాహ‌బలి 2 ట్రైల‌ర్‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా అన్నీ సోష‌ల్ మీడియాల్లో, అన్నీ భాష‌ల్లో క‌లిపి 70 మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ట్రైల‌ర్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే సినిమాకు ఏ రేంజ్ రెనస్పాన్స్ ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈ సినిమా ఆడియో వేడుక‌ను ఏప్రిల్ 26న విడుద‌ల చేయ‌డానికి గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. యం.యం.కీర‌వాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.