'బాహుబలి 2' భారీ షెడ్యూల్..

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించ‌డంతో బాహుబ‌లి 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు దీటుగా బాహుబలి 2ను తెర‌కెక్కించేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు జ‌క్క‌న్న‌. డిసెంబ‌ర్ 14 నుంచి బాహుబ‌లి 2 షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. రామోజీ ఫిలింసిటీలో జ‌రిగే ఈ షెడ్యూల్ చాలా చిన్న‌ద‌ట‌.

సంక్రాంతి నుంచి భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. దాదాపు 80 % షూటింగ్ రామోజీ ఫిలింసిటీలోనే ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన 20% షూటింగ్ కోసం లోకేష‌న్స్ సెర్చ్ చేస్తున్నారు. బాహుబ‌లికి చివ‌రిలో ఇంట‌ర్నేష‌నల్ టీమ్ తో వ‌ర్క్ చేసారు. ఇప్పుడు బాహుబ‌లి 2 కి ప్రారంభం నుంచే ఇంట‌ర్నేష‌న‌ల్ టీమ్ తో వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఇంట‌ర్నేష‌న‌ల్ టీమ్ తో వ‌ర్క్ చేస్తుండ‌డంతో బాహుబ‌లి 2 కి అనుకున్న దాని క‌న్నా ఎక్కువ బ‌డ్జెట్ అవుతుంది. బాహుబ‌లి ని మించిన బడ్జెట్ తో రూపొందుతున్న బాహుబ‌లి 2 ఏరేంజ్ క‌లెక్ష‌న్స్ సాధిస్తుందో..ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

మహేష్ మూవీకి టాప్ సినిమాటోగ్రాఫర్...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం మూవీలో నటిస్తున్నవిషయం తెలిసిందే.శనివారం నుంచి తాజా షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించనున్నారు.

న్యూమూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్...

హీరో నితిన్ ప్రస్తుతం అ..ఆ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు శ్రీనివాస్ దర్శకత్వంలో రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

స్పీడు పెంచమంటున్న సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు,తమిళ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఆ ఆత్మీయ‌త మ‌రువ‌లేనంటున్న నందిత

నీకు నాకు సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన క‌థానాయిక నందిత‌. నిఖిల్ తో క‌ల‌సి నందిత న‌టించిన శంక‌రాభ‌ర‌ణం సినిమా డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

సునీల్ సినిమా ఆగిపోయింది.

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ క్రిష్ణాష్టమి సినిమా చేస్తున్నారు.వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన క్రిష్ణాష్టమి సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున రిలీజ్ కానుంది.