close
Choose your channels

దేవాన్ష్‌కు ప్రేమతో.. బాలయ్య భారీ గిఫ్ట్!

Friday, February 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేవాన్ష్‌కు ప్రేమతో.. బాలయ్య భారీ గిఫ్ట్!

తండ్రి కొడుక్కు, తాతగారు మనవడికి.. నానమ్మ మనవడికి గిఫ్ట్ రూపేణా లేదా భూముల రూపేణా ముఖ్యమైన సందర్భాల్లో గిఫ్ట్‌లుగా ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇదిగో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి బాలకృష్ణల మనవడి కోసం తాతగార్లిద్దరూ పోటీపడి మరీ గిఫ్ట్‌లు ఇచ్చేస్తున్నారు. దీంతో ఏడాది ఏడాదికి.. ఏమీ పని చేయకున్నా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ఆస్తులు మాత్రం రెట్టింపయిపోతున్నాయి. అయితే దేవాన్ష్‌కు ఇప్పటి వరకూ చంద్రబాబు ఏమిచ్చారన్నది పక్కనెడితే.. తాజగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. అదే కూతురు బిడ్డకు బాలయ్య ఇచ్చిన ఎవరూ ఊహించని గిఫ్ట్!

మనవడికి ప్రేమతో..!
ప్రతి ఏడాదిలాగే నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తులు, అప్పుల వివరాలను గురువారం నాడు లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆస్తుల్లో తాత కంటే మనవడికే ఎక్కువున్నాయ్. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. దేవాన్ష్ ఆస్తులను చూసిన జనాలంతా వామ్మో.. ఇంతనా అని నోరెళ్ల బెడుతున్నారట. అయితే.. ఈ ఆస్తుల్లో తన మనవడికి ప్రేమతో.. అంటూ బాలయ్య ఇచ్చిన గిఫ్ట్ కూడా ఉందట. అదేంటంటే.. బాలయ్యకు హెరిటేజ్ ఫుడ్స్‌లో 26,440 షేర్లు ఉన్నాయ్. అయితే ఆ షేర్లు మొత్తం మనవడికి రాసిచ్చేశారు. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం ఒక్కో షేర్ విలువ రూ.369.45. అంటే 26,440 షేర్లకు గాను రూ.97,68,258 అవుతుందన్న మాట. అయితే ఇది మార్కెట్‌ను ఎంతైనా పెరగొచ్చు.. తగ్గొచ్చు కూడా.. ఇదీ లెక్క. అంటే.. బాలయ్య గిఫ్ట్ విలువ రూ. 97,68,258 అన్న మాట. అయితే మనవడికి ఇలా గిఫ్ట్‌లు ఇవ్వడం బాలయ్యకు కొత్తేమీ కాదు.. గతంలో కూడా రూ.2.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం విదితమే.

దేవాన్ష్‌కు ప్రేమతో.. బాలయ్య భారీ గిఫ్ట్!

మున్ముంథు ఇంకెన్నో!
మొత్తానికి చూస్తే.. అటు పొలిటికల్ తాత.. ఇటు సినిమా తాత ఇద్దరు ఇస్తున్న గిఫ్ట్‌లతో దేవాన్ష్ ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయ్.. ఇక ఆ పిల్లగాడు పెద్దయ్యాక ఏమీ చేయనక్కర్లేదన్న మాట. ఆ ఆస్తులను అరిగిస్తే సరిపోతుందేమో అంటూ కామెంట్స్ వినపడుతున్నాయ్.. మున్ముందు ఇద్దరు తాతలు ఎన్నెన్ని కోట్లు విలువ చేసే గిఫ్ట్‌లు ఇచ్చి.. ఆస్తులు ఇంకెంత పెంచేస్తారో ఏంటో మరి.!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.