బాల‌కృష్ణ చిత్రానికి సీక్వెల్‌?

  • IndiaGlitz, [Wednesday,December 06 2017]

న‌ట‌సింహ బాల‌కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు సీక్వెల్ చిత్రాల్లో న‌టించ‌లేదు. ఆ మ‌ధ్య ఆదిత్య 369కి సీక్వెల్‌గా తెర‌కెక్కే చిత్రంలో ఆయ‌న న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. దీంతో.. ఆ వార్త‌ల‌కి బ్రేక్ ప‌డ్డాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. బాల‌య్య ఓ సీక్వెల్ చేయ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది.

కాస్త వివరాల్లోకి వెళితే.. బాల‌కృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో న‌ర‌సింహ‌నాయుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా.. పాత రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాసి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి చిన్ని కృష్ణ క‌థ‌ను అందించారు.

ఇప్పుడు ఆ స‌బ్జెక్ట్‌ని కొన‌సాగిస్తూ.. చిన్నికృష్ణ ఓ క‌థ‌ను త‌యారు చేసుకున్నారట‌. బాల‌కృష్ణ‌కు ఆ క‌థ న‌చ్చింద‌ని.. ఈ సీక్వెల్ చేయ‌డానికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ముచ్చ‌టించుకుంటున్నారు.

More News

మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సూర్య‌

గ‌జిని చిత్రంతో తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకున్నారు త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.  ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన‌ చిత్రం తానే సేరంద కూట్ట‌మ్‌.

చరణ్ హీరోయిన్ గా...

మజ్ను చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళుతోంది.

యాక్షన్ ప్లాన్ లో పూరి....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా సినిమా చేస్తోన్న సంగతి తెలిసింది. పూరి దర్శకత్వంతో పాటు స్వీయ నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. `మెహబూబా` పేరుతో రూపొందుతోంది.

రెండు తొలిప్రేమ‌లు.. రెండు కామ‌న్ పాయింట్స్‌

జులై 24, 1998.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు. ఎందుకంటే.. ఆ రోజే ప‌వ‌న్ సినీ జీవితంలో ఓ అద్భుతం జ‌రిగింది. అదే తొలి ప్రేమ సినిమా విడుద‌లవ‌డం.

తెలుగు ప్రేక్షకులకు 'మాతంగి' చిత్రం తప్పకుండా నచ్చుతుంది - రమ్యకృష్ణ

'బాహుబలి'లో శివగామి క్యారెక్టర్‌లో అత్యద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్‌ చేసిన రమ్యకృష్ణ తాజాగా 'మాతంగి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస విజువల్స్‌ ప్రై.లి. పతాకంపై కన్నన్‌ తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్‌ 'మాతంగి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తు