close
Choose your channels

మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సూర్య‌

Wednesday, December 6, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌జిని చిత్రంతో తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకున్నారు త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన‌ చిత్రం తానే సేరంద కూట్ట‌మ్‌. ఈ సినిమాని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కి తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి స్పందన వచ్చింది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా జనవరి 12న త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సూర్య మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని త‌మిళ నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌లే సందీప్ కిషన్ తో మానగరం`చేసి విజయాన్ని అందుకున్న దర్శకుడు లోకేష్ కనగారాజ్ తో సూర్య ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నార‌ని తెలిసింది. దీనికంటే ముందు సెల్వ రాఘవన్ కాంబినేష‌న్‌లో సినిమా చేయబోతున్నారు సూర్య‌. ప్రస్తుతం 'గ్యాంగ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.