బాలయ్య రౌడీ... పోలీసూ..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలయ్య రౌడీయా? పోలీసా? రౌడీగా రూల్ చేస్తారా? పోలీస్‌గా రూల్ చేస్తారా? ఏదైతేనేమి... మొత్తానికి రౌడీపోలీస్‌గా రూలర్ అనిపించుకుంటాడా? అని అభిమానుల్లో కుతూహలంగా ఉంది. రౌడీ, పోలీస్ అనేవి రెండు గెటప్పులా? రెండు పాత్రలా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి మాత్రం `రూలర్ `అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు వినికిడి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే ఈ సినిమా మేజర్ షెడ్యూల్ నార్త్ ఇండియాలో జరగనుందట. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అని వినికిడి. సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.
ఇందులో ఇద్దరు హీరోయిన్లను స్కోప్ ఉంది. ఒక హీరోయిన్గా శ్రియను ఎంపిక చేసుకున్నారని టాక్. మరో హీరోయిన్గా ఎవరుంటారో చూడాలి. ఐటమ్ సాంగ్‌లోనూ ఓ పాపులర్ భామ కాలుకదుపుతారని టాక్. వచ్చే నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.