మ‌రోసారి అలాంటి పాత్ర చేయ‌బోతున్న‌ బాల‌య్య‌

  • IndiaGlitz, [Wednesday,February 12 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత మ‌రో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 106వ చిత్ర‌మిది. ఈ నెల 26 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు పాత్ర‌ల్లో క‌న‌ప‌డబోతున్నార‌ట‌. అందులో ఒక పాత్ర ఫ్యాక్ష‌నిస్ట్ పాత్ర అని టాక్‌. ఫ్యాక్ష‌నిస్ట్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌డం కొత్తేమీ కాదు.. స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు చిత్రాల్లో బాల‌కృష్ణ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ పాత్ర‌లో న‌టించారు.

ఆ సినిమాలు ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు త‌న‌కు అచ్చొచ్చిన పాత్ర‌లోనే బాల‌కృష్ణ న‌టించ‌నున్నార‌ట‌. మ‌రో పాత్ర అఘోరా పాత్ర అని టాక్‌. ఈ పాత్ర కోస‌మే బాల‌కృష్ణ గుండ్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నార‌నేది స‌మాచారం. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెండు భారీ హిట్స్ త‌ర్వాత బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు ఎలా ఉంటాయో బోయపాటికి తెలుసు. అలాగే బాల‌య్య‌ను ఫ్యాక్ష‌నిస్ట్ పాత్ర‌లో ప్రేక్ష‌కులు చూసి చాలా కాల‌మైంది. మ‌రి ఆయ‌న‌కు అచ్చొచ్చిన ఫ్యాక్ష‌న్ పాత్ర ఎలా క‌లిసి వ‌స్తుందో చూడాలి.

More News

సందీప్ కిష‌న్ 'A1 ఎక్స్‌ప్రెస్‌' రిలీజ్ డేట్

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. '

'ఆరుద్ర' సెన్సార్‌ పూర్తి, త్వరలో విడుదల

తమిళంలో రచయితగానే కాకుండా నటుడిగా, దర్శకనిర్మాతగా పా.విజయ్ కు మంచి పేరుంది. ఆయన ప్రధాన పాత్రలో

'శివ 143' ఫిబ్రవరి14న విడుదల

ఇందుకు గాను ఉప్పల్ సినీ పోలీస్ మాల్ లో ఘనం గా జరిగిన ప్రీ రేలీజ్ వేడుకలలో

ప్రేమికుల రోజున 'లవ్ స్టోరి' మ్యూజికల్ ప్రివ్యూ

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ  ‘‘లవ్ స్టోరీ’’.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో

పి.య‌స్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'శక్తి' గా రానున్న‌ శివ కార్తికేయ‌న్

త‌మిళ - తెలుగు భాష‌ల్లో `అభిమ‌న్యుడు` చిత్రంతో స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు పి.య‌స్‌. మిత్ర‌న్‌.