close
Choose your channels

Balayya, Prabhas:'హంటింగ్' అంటున్న బాలయ్య.. 'భైరవ'గా రాబోతున్న ప్రభాస్‌..

Friday, March 8, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. అంతేకాకుండా ఈ మూడు సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. తాజాగా యువ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్‌లో కనపడ్డాడు. "ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అని విలన్ అడగగా.. సింహం నక్కలా మీదకు వస్తే వార్ ఎలా అవుతుందిరా లఫుట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 1980ల నేపథ్యంలో యాక్షన్‌ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే "వయెలెన్స్‌కి విజిటింగ్ కార్డు.. ప్రపంచానికి ఇతను తెలుసు.. కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు" అనే కొటేషన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ గ్లింప్స్‌తో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898AD' సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. మహాశవరాత్రి సందర్భంగా సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరుని రివీల్ చేశారు. ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని తెలిపారు. ఇందులో డార్లింగ్ గెటప్ కూడా కొత్తగా ఉంది. పిలకతో గతంలో ఎప్పుడూ చూడని విధంగా డార్లింగ్ లుక్ ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ సాంగ్‌ని ప్రభాస్-దిశా పటాని మధ్య ఇటలీ బీచ్‌లో షూట్ చేస్తున్నారు.

కాగా ఇటీవల నాగ్ అశ్విన్ ఈ కథ గురించి మాట్లాడుతూ 'ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం' అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా నటించనుండగా.. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, రానా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది మే 9న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.