Balayya, Prabhas:'హంటింగ్' అంటున్న బాలయ్య.. 'భైరవ'గా రాబోతున్న ప్రభాస్‌..

  • IndiaGlitz, [Friday,March 08 2024]

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. అంతేకాకుండా ఈ మూడు సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. తాజాగా యువ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్‌లో కనపడ్డాడు. ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అని విలన్ అడగగా.. సింహం నక్కలా మీదకు వస్తే వార్ ఎలా అవుతుందిరా లఫుట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 1980ల నేపథ్యంలో యాక్షన్‌ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే వయెలెన్స్‌కి విజిటింగ్ కార్డు.. ప్రపంచానికి ఇతను తెలుసు.. కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ గ్లింప్స్‌తో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898AD' సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. మహాశవరాత్రి సందర్భంగా సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరుని రివీల్ చేశారు. ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని తెలిపారు. ఇందులో డార్లింగ్ గెటప్ కూడా కొత్తగా ఉంది. పిలకతో గతంలో ఎప్పుడూ చూడని విధంగా డార్లింగ్ లుక్ ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ సాంగ్‌ని ప్రభాస్-దిశా పటాని మధ్య ఇటలీ బీచ్‌లో షూట్ చేస్తున్నారు.

కాగా ఇటీవల నాగ్ అశ్విన్ ఈ కథ గురించి మాట్లాడుతూ 'ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం' అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా నటించనుండగా.. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, రానా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది మే 9న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

More News

Shweta Mohan:ప్రఖ్యాత గాయని శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ‘స్త్రీ’

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల శక్తి, సామర్థ్యాలను చాటేలా ‘స్త్రీ’ అనే ఓ ఆల్బమ్ శ్రోతల ముందుకు తీసుకు రాబోతోన్నారు.

Kannappa:'కన్నప్ప' ఫస్ట్ లుక్‌లో అదరగొట్టిన విష్ణు.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడు..

మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'కన్నప్ప' (Kannappa) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

LPG Cylinder Price: మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త.. వంట గ్యాస్ ధర తగ్గింపు...

మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంటగ్యాస్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

NDA: ఎట్టకేలకు ఎన్డీఏలోకి తెలుగుదేశం.. బీజేపీ పెద్దలతో ఫలించిన చర్చలు..

ఎట్టకేలకు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయమైంది. ఊహించినట్లుగానే 2014 ఎన్నికల సీన్ రిపీట్ కానుంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి.

Mallareddy:కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుతో భేటీ..!

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్..