close
Choose your channels

బీజేపీ కార్పొరేటర్లను కెలికితే.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Friday, December 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమ పార్టీ కార్పొరేటర్లను కెలికితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడానికి వెనుకాడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. నేడు భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద నూతన కార్పోరేటర్లతో ఆయన ప్రమాణం చేయించారు. అవినీతికి పాల్పడబోమని.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని.. పార్టీ ఫిరాయించబోమని‌.. బీజేపీకి చెడ్డ పేరు తీసుకురాబోమని భాగ్యలక్ష్మీ దేవాలయం సాక్షిగా బీజేపీ నూతన కార్పోరేటర్లతో సంజయ్ ప్రమాణం చేయించారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.
కార్పోరేటర్ల కొనుగోళ్ళకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని నియమించకుండా ముఖ్యమంత్రి కావాలనే ఆలస్యం చేస్తున్నారు. వరద బాధితులకు సాయంపై బీజేపీ కార్పోరేటర్లు ఉద్యమానికి దిగబోతున్నారు. మా కార్పోరేటర్లు పార్టీ ఫిరాయింబోచమని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. పొర్లు దండాలు పెట్టినా.. కేసీఆర్ జైలుకు పోవటం‌ ఖాయం. కాళీమాత దేవాలయం భూములపై ఎండోమెంట్ అధికారులు స్పందించారు. దేవస్థానాల‌ భూముల జోలికొస్తే ఎంతకైనా తెగిస్తాం. పాతబస్తీ బీజేపీ అడ్డా... పాతబస్తీని అభివృద్ధి చేసి చూపుతాం.

సీఎం మార్ఖత్వం, చేతకాని తనం వలన గెలిచిన కార్పోరేటర్లు ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్‌లు హైద్రాబాద్‌ను విధ్వంసం చేస్తున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం విముక్త్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేస్తాం. ఎల్ఆర్ఎస్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. భాగ్యలక్ష్మి దేవాలయం వలనే భాగ్యనగరం అనే పేరొచ్చింది. అధికారం ఎవరి దగ్గరుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం ఎంఐఎంకు అలవాటు. మెట్రో కావాలా? వద్దా? అనేది పాతబస్తీ ప్రజలు తేల్చుకోవాలి. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డగా మారింది. బీజేపీ ఏ మతానికి అడ్డు కాదు. హిందూ ధర్మం జోలికొస్తే ఊరుకోం. శుక్రవారం రోజున భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటం సంతోషం. అమ్మవారి దయతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాం’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.