close
Choose your channels

Gadde Rammohan: టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాట్సాప్ చాట్ లీక్.. మహిళలతో అసభ్యకరంగా..!

Thursday, May 9, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Gadde Rammohan: టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాట్సాప్ చాట్ లీక్.. మహిళలతో అసభ్యకరంగా..!

ఏపీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుకు సంబంధించిన ఓ వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. మహిళలతో అసభ్యకరంగా చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. గద్దెలీక్స్ అంటూ ఆయన సన్నిహితుడే వీటిని పోస్ట్ చేశారు.

"గద్దె రామ్మోహన్ గారు నమస్తే... నన్ను వాసు అంటారు అండి నేను గుర్తు ఉన్నానా సార్.... అదే అండి గత 15 సంవత్సరాలుగా నాతో అడ్డమైన పనులు అన్ని చేయించుకొని మీ అవసరాలన్ని మూడో కంటికి తెలియాకుండా తీర్చాను కదా. నేనే సార్ గుర్తు పట్టారు అనుకుంటున్నా... సార్ మీరు చేసింది చాలా తప్పు సార్, నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నానో మీకు తెలుసు, కానీ మీరు నన్ను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడతారు అని అనుకోలేదు. ప్రతి మనిషి ఎంత నీచమైన పనులు చేసిన వాడికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం పొతే ఎవరిని లెక్క చేయడు.

మీకు 15 ఏళ్లు సేవలు చేసి మీ అవసరాలు అన్ని తీర్చిన నన్ను, ఇంత దారుణంగా మోసం చేస్తావు అనుకోలేదు... నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఈరోజు నుంచి అనుభవిస్తావు... నాకు నువ్వు చేసిన అవమానం కంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావ్.. ఇన్నాళ్లుగా నీకు నాకు మాత్రమే తెలిసిన ని నిజ స్వరూపాని ఈరోజు ప్రజల ముందు ఉంచబోతున్నా... నీ నీచమైన చీకటి బతుకును ప్రజలకు వివరించాలని, నీలాంటి మేక వణ్ణిన తోడేలును ప్రజలు నమ్మకూడదు అని నీ నీచచరిత్రను బయట పెడుతున్నాను. నీ మాటలకు ఇంకా ఏ అమ్మాయిలు మోసపోకూడదు అని ఇవన్నీ బయట పెడుతున్నాను.

Gadde Rammohan: టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాట్సాప్ చాట్ లీక్.. మహిళలతో అసభ్యకరంగా..!

నీ కామవాంఛ వాళ్ల ఎంత మంది జీవితాలు పోయాయో నీకు నాకు తెలుసు. ఈ కింద ఫొటోలో ఉంది నువ్వే కదా. ఇవి ఎక్కడ దిగవో నీకు బాగా గుర్తు ఉండే ఉంటుంది. ఆ టైంలో నువ్వు చేసిన పనులు అన్ని నీకు బాగా గురుతుంటాయి. ముసలోడి దసరా పండగలాగా నువ్వు ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నవో మనకి తెలుసు. నీకు ఏమైనా గుర్తు రాకపొతే చెప్పు మరిన్ని క్లూస్ ఇస్తా సార్. ఇలా రాస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నా జీవితంలో నీ గురించి ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎం చేస్తాం మన టైం బాడ్...

మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు వీటి నుంచి ఎలా బయటపడగలరో కూడా నాకు తెలుసు కానీ ఇప్పుడు పడలేరు. ఎందుకంటే ఈ మెసేజ్‌స్‌లో ఉన్న ఫోన్ నంబర్స్ 9010565110, 9848120700 నీవి కాదా? ఆ వాట్సాప్ చాట్.. ఆ బాషా నీకు నాకు బాగా తెలుసు కదా. లేకపోతే శ్వేతా, నర్మదాలని అడుగు, లేకపొతే బంగారాన్ని అడుగు తెలుస్తోంది. అసలు వాళ్లు ఎవరో నాకు తెలియదు అది అంతా ఫేక్ అంటావా. నీ కోసమే ఇంకో ఫొటో పెట్టా.. అది ఎవరి విడాకులో తెలుసుగా లేక అది కూడా నినే గుర్తు చేయనా... అంటూ రామ్మోహన్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ నేతలందరూ ఆడవాళ్లను హీనంగా చూసేవారని.. అవసరానికి వాడుకునే వారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి నాయకులు అధికారంలోకి వస్తే మరింతగా రెచ్చిపోతారని.. ఆడబిడ్డలకు రక్షణ ఉండదని విమర్శిస్తున్నారు. అందుకే నీచమైన పనులకు పాల్పడుతున్న తెలుగుదేశం నాయకులకు మే 13న జరిగే పోలింగ్‌లో బుద్ధి చెబుతామని ముక్తకంఠంగా చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.