మూడో విడత పోలింగ్ ముగింపు.. నంబర్ వన్‌లో బెంగాల్!

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

భారత దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్‌‌లో 79శాతం నమోదవ్వడం రికార్డ్ బ్రేక్ చేసినట్లేనని చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక్క రోజే దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఓటు ఎవరికి వేసినా బీజేపీకే పడుతోందని సంచలన ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే స్వయానా ఇలా శశిథరూర్, అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస జరిగింది. బూత్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడు. మరికొన్నిచోట్ల బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు.

ఎన్నికలు ఎక్కడెక్కడ జరిగాయ్..!
దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు.

నమోదైన పోలింగ్ శాతాలివీ..

అసోం - 74.05
బిహార్‌ - 54.95
ఛత్తీస్‌గఢ్‌ - 64.03
గోవా - 70.96
గుజరాత్‌ - 58.81
జమ్ము కశ్మీర్‌ - 12.46
కర్ణాటక - 60.87
కేరళ - 68.62
మహారాష్ట్ర - 55.05
ఒడిశా - 57.84
త్రిపుర - 71.13
ఉత్తర్‌ప్రదేశ్‌ - 56.36
పశ్చిమ బెంగాల్ - 78.94
దాద్రానగర్‌ హవేలి - 71.43
డామన్‌ డయ్యూ - 65.34

కాగా.. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది.. మూడో విడతలో నమోదైన పోలింగ్ ప్రకారం కోల్‌కతా మొదటి స్థానంలో ఉండగా.. అసోం, దాద్రానగర్ హవేలి, త్రిపుర, గోవా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

More News

ఇంటర్ స్టూడెంట్స్‌కు.. ఇంటర్ ఫెయిలైన రామ్ సలహా!

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల అనంతరం ఫెయిలైన.. మార్కులు సరిగ్గా రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు తనువు చాలించిన సంగతి తెలిసిందే.

లంకలో బాంబులు పేల్చింది వీడే.. 

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు వందలాది కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఇప్పటి వరకూ 321 మంది ప్రజలు మరణించగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

'సూర్య‌వంశీ' తో క‌త్రినా

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాలు మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. ఆయన రూపొందించే సినిమాలన్నీ మాస్ మసాలాతో పక్కా కమ‌ర్షియల్‌గా ఉంటాయి.

యువతి దుస్తులు తీయమన్న వినయ్ వర్మ అరెస్ట్!

'సూత్రధార్' యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మ.. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాలంటూ యువతులను వేధించిన సంగతి తెలిసిందే.

సూర్య‌, శివ‌.. అఫీషియ‌ల్‌

హీరో అజిత్‌తో వరసగా నాలుగు సినిమాలు చేసి, నాలుగు సినిమాలనూ సూపర్‌హిట్ చేసిన ఘనత దర్శకుడు శివకు దక్కుతుంది.