close
Choose your channels

ఇంటర్ స్టూడెంట్స్‌కు.. ఇంటర్ ఫెయిలైన రామ్ సలహా!

Tuesday, April 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంటర్ స్టూడెంట్స్‌కు సలహా.. బూతు వాడిన హీరో రామ్!

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల అనంతరం ఫెయిలైన.. మార్కులు సరిగ్గా రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు తనువు చాలించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇప్పటి వరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ చూసిన టాలీవుడ్ సెలబ్రిటీలు చలించిపోయారు. సోషల్ మీడియా వేదికగా నటీనటులు, డైరెక్టర్స్‌తో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. తాజాగా హీరో రామ్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

రామ్ ట్వీట్ సారాంశం..

"ఇంటర్ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్లకి, చెల్లెళ్లకి.. మీరు జీవితంలో అవ్వబోయే దానికి.. చేయబోయేదానికి ఇది ఒక------తో సమానం. దయచేసి లైట్ తీసుకోండి. ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ పోతినేని" అని ఆయన ట్వీట్ చేశాడు. అయితే రామ్ ట్వీట్‌పై పెద్ద ఎత్తున నెటిజన్లు, అభిమానులు కన్నెర్రజేస్తున్నారు.

రామ్‌పై ఆగ్రహం..

ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం ------తో సమానం అని అంటారా..? ఒక సెలబ్రిటీ అయ్యుండి మీరు అనాల్సిన, వాడాల్సిన పదమేనా..? మీకు ఇంకేం పదాలు దొరకలేదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ లాంగ్వేజ్ ఏంటి..? పూరీ జగన్నాథ్ మిమ్మల్ని మార్చేశారా ఏంటి..? పూరీకి బాగా కనెక్ట్ అయినట్లున్నారే..? అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయితే కొందరు మాత్రం.. ఎస్ ఇలా చెబితే పిల్లలు వింటారు.. తిన్నగా కూర్చోబెట్టి చెబితే అస్సలు వినే రోజులు కావు.. వాళ్లు వినే పరిస్థితులో లేరు అంటూ కొందరు రామ్‌ను మెచ్చుకుంటున్నారు.

INTER RESULTS ey jeevitham anukuney na thammullaki, chellillaki..meeru jeevitham lo avvaboyedhaniki..cheyaboyedhaniki, idhi oka aa*** tho samanam...dayachesi lite thesukondi..

Itlu,
Inter kuda poorthicheyani me..
-R.A.P.O#InterBoardMurders

— RAm POthineni (@ramsayz) April 23, 2019

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.