'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్ అప్ డేట్

  • IndiaGlitz, [Saturday,January 13 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. శ్రీ‌మంతుడు వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మ‌హేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు. డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని, లోగోని సంక్రాంతి పండ‌గ‌ని పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ఫ‌స్ట్ లుక్ సినిమా మీద ఆస‌క్తి క్రియేట్ చేసేలా ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌హేష్ గ‌త రెండు చిత్రాలు బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా విజ‌యం మ‌హేష్‌కి కీల‌కంగా మారింది. కాగా, ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

More News

రకుల్ ను సిఫార్సు చేసిన కాజల్

ఇటీవలే కథానాయిక గా 50సినిమాలను పూర్తిచేసుకుంది అందాల నటి కాజల్ అగర్వాల్.

సరికొత్త పాత్రలో శ్రియ

శ్రియ ముఖ్య పాత్రలో కొత్త చిత్రం ప్రారంభమైనది.

పారిస్ లో బన్ని స్పెషల్ సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'.

దర్శకుడి మాట - మనస్సుకు దగ్గరైన 'మిఠాయి'

హలో ఫ్రెండ్స్,ఈ అనౌన్స్మెంట్ కి టైం పట్టింది.నిజం చెప్పాలంటే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైంనే తీసుకున్నా.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సంక్రాంతి జరుపుకున్న నటి మంచు లక్ష్మి

ప్రముఖ సినీనటి,నిర్మాత మంచులక్ష్మి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఫిల్మ్ నగర్ లోని